Take a fresh look at your lifestyle.

పథకం ప్రకారమే రామకృష్ణను హత్య చేశారు

Ramakrishna was murdered as per the scheme
విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర

మండల పరిదిలో ని లచ్చిగూడెం గ్రామానికి చెందిన ఎంఆర్‌పి కారం రామకృష్ణ ను పక్కా పదకం ప్రకారమే హత్య చేశారని హత్యకు భూవివాదమే కారణమని భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర అన్నారు. శుక్రవారం రామకృష్ణ ను హత్య పై నిందితుల సమక్షంలో జరిగిన విలేకరు సమావేశంలో హత్యకు గల కారణాలను ఆయన వెల్లడించారు. గ్రామానికి చెందిన సోంది ముద్దరాజు, అతని కుమారుడు రవి బాబు మరియు కారం రామకృష్ణల మద్య కొంత కాలంగా భూ వివాదం ఉంది. ఎలాగైనా రామకృష్ణను హత్య చేస్తే అతనితో చిక్కులు ఉండవని బావించిన సోంది రవిబాబు తన మిత్రుడు చర్ల మండలం గుంపెన గూడెం గ్రామానికి చెందిన పాయం సతీష్‌ ‌సహాయంతో చత్తీష్‌ఘడ్‌ ‌రాష్ట్ర కుంట తాలూకా పరిదిలో ని మైత గ్రామానికి వెళ్లి అక్కడ వారి బందువులు అయినటువంటి పొడియం నగేష్‌, ‌పొడియం లచ్చు, పొడియం భద్రయ్య ను కలసి మాగ్రామానికి చెందిన కారం రామకృష్ణతో భూ వివాదం ఉందని భూ వివాద విషయంలో అతనిలో మార్పు రావడం లేదని ఎలాగైనా రామకృష్ణను చంపాలని తెలిపారు. అదే రోజు రాత్రి ఏడుగంటల సమయంలో మైత గ్రామానికి చెందిన నగేష్‌, ‌లచ్చు, భద్రయ్యలు మండలంలో ని గుర్రాల బైలు బ్రిడ్జి వద్దకు వచ్చి రవిబాబుకు ఫోన్‌ ‌చేశారు. రవి, సతీష్‌లు అక్కడికి వెళ్లి సుమారు 9 గంటల వరకు అందరు కలసి ఉండి హత్య పై సమాలోచనలు చేసి పదకం రూపొందించారు.పదకం ప్రకారం సుమారు 12.30 గంటల సమయంలో సోంది రవిబాబు, పొడియం లచ్చులు చెరొక కత్తితో పాటు నగేష్‌ ‌తనతో తెచ్చుకున్న గొడ్డలితో రామకృష్ణ ఇంటి సమీపంకు వెళ్లారు. ఆ సమయంలో సోంది ముద్దరాజు, పాయం సతీష్‌లు ఇంటి వెనుక రోడ్డు మీద కాపలా ఉండగా , సోంది భద్రయ్య ఇంటి ముందు కాపలాగా ఉన్నాడు. రామకృష్ణ ఇంటికి చేరుకున్న సోంది రవిబాబు, పొడియం లచ్చు, పొడియం నగేష్‌లు ఇంట్లోకి వెళ్లి నిద్రలో ఉన్న రామకృష్ణను రవి, నగేష్‌లు కాళ్లు చేతులు పట్టుకోగా లచ్చు తన వద్ద ఉన్న కత్తితో రామకృష్ణ గొంతు కోశాడు.

ఆ సమయంలో రామకృష్ణ భార్య తులసి నిద్రలేచి అడ్డుకునే ప్రయత్నం చేయగా నగేష్‌ ‌తన వద్ద ఉన్న గొడ్డలితో తల పై కొట్టాడు. ఇదే అదును బావించిన రవిబాబు తన వద్ద ఉన్న కత్తితో ఆమె మెడను కోసి హత్య చేసే ప్రయత్నం చేయగా ఆమె చేయి అడ్డుపెట్టడంతో చేయికి గాయం అయింది. వెంటనే తేరుకున్న తులసి ఒక్క సారిగా పెద్ద, పెద్ద కేకలు వేయడంతో వారు అక్కడ నుండి పారి పోయారు. రామకృష్ణ ను వైద్యం నిమిత్తం భద్రాచలం తీసుకు వెళుతుండగా మార్గ మద్యలో చనిపోయాడు. భార్య తులసి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలో కి దింపడం జరిగిందన్నారు. ఈ రోజు సిఐ నల్లగట్ల వెంకటేశ్వర్లుకు వచ్చిన సమాచారం మేరుకు ఎస్‌ఐ ‌రతీష్‌ ‌పోలీస్‌ ‌సిబ్బందితో గంగోలు గ్రామం వద్ద రెండు ద్విచక్రవాహనాల పై వెళుతున్న ఆరుగురు వ్యక్తులను విచారించగా వారిలో లచ్చిగూడెం గ్రామానికి చెందిన రవి బాబు, ముద్దరాజు, చత్తీష్‌ఘడ్‌ ‌రాష్ట్రం మైత గ్రామానికి చెందిన పొడియం నగేష్‌, ‌పొడియం లచ్చు, పొడియం భద్రయ్య, చర్ల మండలం గుంపెన గూడెం గ్రామానికి చెందిన పాయం సతీష్‌ ‌గా తెలిపారు వారి వద్ద నుండి రెండు కత్తులతో పాటు, హొక గొడ్డలి, రెండు ద్విచక్రవాహనాలను స్వాదీనం చేసుకుని విచారించగా వారు పై విషయాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. కాగా హత్యతో ప్గాన్న ఆరుగురు వ్యక్తులతో పాటు హత్యను ప్రోత్సహించిన మరో ఇద్దరు వ్యక్తుల పై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హజరు పర్చనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసును అతి తక్కువ కాలంలో చేదించిన సిఐ నల్లగట్ట వెంకటేశ్వర్లును, ఎస్‌ఐ ‌రతీష్‌, ‌సిబ్బందిని అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏఎస్సై సత్యనారాయణ ప్గాన్నారు.

Leave a Reply