Take a fresh look at your lifestyle.

మద్య నిషేదం కోసం ఐక్య పోరాటాలు

- Advertisement -

రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలు మహిళా సంఘాలు 
టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తరువాత బంగారు తెలంగాణ అని చెప్పి, తాగుబోతుల తెలంగాణగా మార్చి వేసిందని మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఇందిరా శోభ మండి పడ్డారు. ఈ మేరకు శనివారం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అధ్యక్షతన ‘మహిళలపై ఆగని అత్యాచారాలు-మహిళా సాధికరతకు సవాళ్ళు’ అన్న అంశంపై హిమాయత్‌ ‌నగర్‌ ‌లోని రాజబహదూర్‌ ‌గౌర్‌ ‌లో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులు ఇచ్చి మానవ మృగాలుగా మార్చుతున్నారని విమర్శించారు. నేర చరిత్ర వున్న నాయకులను రాజకీయాలలో పోటీ చేయకుండా కఠిన చట్టాలు తీసుకరావాలని అన్నారు. మహిళల పట్ల కేసిఆర్‌కు చిత్తశుద్ధి లేదని, మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదని విమర్శించారు. రాష్ట్రంలో 17 వేల బెల్ట్ ‌షాపులు నడుస్తున్నాయని వీటిని నిషేదించాలని, లేనిపక్షంలో మహిళలు తిరగబడుతారని హెచ్చరించారు. 70 సంవత్సరాల కాలంలో కూడా ఇంకా మహిళలపై హింస కొనసాగుతున్నదని, మహిళల మనుగడే కష్టంగా మారిందని, కుటుంబం, సమాజంలో మార్పు రావాల్సివుందని, విద్యా వ్యవస్థలో నైతిక విలువలు నేర్పించాలని, వావి వరసలు మర్చి మృగాలలాగా అత్యాచారాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. ‌జ్యోతి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించే విధంగా స్వయం ప్రతిపత్తి కల్పించాలని, రాజకీయ నాయకుల జోక్యం వలన నింధితులు తప్పించుకుంటున్నారని, ఇలాంటి నేతలకు రాబోయే కాలంలో మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మద్య నిషేదం కోసం మహిళ ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హింస లేని సమాజం కోసం, మహిళ ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించడానికి మహిళలందరు కదిలి రావాలని పిలుపునిచ్చారు. సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ మహిళలకు విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా సొంత ఆస్తి, అధికారం లేకుండా సమాజంలో సమనత్వం లేనంత కాలం సాధికారత సాధ్యం కాదని మహిళలు రాజకీయ ఆర్థిక సాధికారతను సాధించినప్పుడే మహిళలపై హింస తగ్గుతుందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు కారణమైన మద్యాన్ని , అశ్లీలతను నిషేదించకుండా నింధితులకు ఉరి శిక్షలు వేసినంత మాత్రాన నేరాలు ఆగవని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని, నేరస్థులతో బిజెపి ప్రభుత్వం నిండిపోయిందన్నారు. యోగులను భోగులను బీజేపీ కాపాడుతున్నదని, మహిళల వస్త్రధారణ పై కామెంట్‌ ‌చేస్తూ మహిళలు ఇంటి నుండి బయటకు రాకుండా మనోవాదాన్ని పెంచి పోషిస్తున్న మతోన్మాదులకు మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పివోడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు మహిళల విద్య, ఉపాధి, కొరకు ప్రత్యేక బడ్జెట్‌ ‌కేటాయించడం లేదని విమర్శించారు. పితృస్వామిక భావజాలం కూడా మహిళల హింసకు కారణమవుతున్నాయని, చట్టాలలో లొసుగుల కారణంగా ఇంకా నిర్భయ దోషులకు శిక్షలు అమలు కాకపోవడం దౌర్భగ్యమని నింధితుల తరుపున వకాలు పుచుకొని, శిక్షలు అడ్డుకోవడం న్యాయవ్యవస్థకే మాయని మచ్చని విమర్శించారు. పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా నీరుగార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని విమర్శించారు. కృష్ణకుమారి మాట్లాడుతూ మహిళలు సంఘటిత, నిరంతర ఉద్యమాలు, పోరాటాల ద్వారానే తమ హక్కులు సాధించుకోవచ్చునని మహిళలు నిర్వహించిన ఉద్యమాలలో మహిళలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ ఎఫ్‌ ‌డబ్యూ రాష్ట్ర కోశాధికారి ఎస్‌. ‌నళిని రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఫైమీది, కమలమ్మ, ఉషా, కరుణ, అశ్విని, పల్లవి, షాహేదబేగం, లక్ష్మమ్మ, సత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply