Take a fresh look at your lifestyle.

నేతల మధ్య యూనిటీ పార్టీ పటిష్టానికి అవసరం

రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరినీ కలుస్తా ఏఐసీసీ ఇంఛార్జి టాగూర్‌ 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తేవడమే తమ మిషన్‌ ‌లక్ష్యమని ఏఐసీసీ ఇంఛార్జి మణికం ఠాగూర్‌ ‌తెలిపారు. పార్టీ అధికారంలోకి రావాలంటే సిస్టమాటిక్‌ ‌టీమ్‌ ‌వర్క్ అవసరమని అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మణికం ఠాగూర్‌ ‌మీడియా ప్రతినిధులతో చిట్‌ ‌చాట్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి లీడర్లు ఉన్నారని పార్టీ అధికారంలోకి రావాలంటే పెద్ద కష్టం కాదని తాను ఫీల్‌ అవుతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటదని కానీ పార్టీ స్టాండ్‌ ‌ప్రతి ఒక్కరు ఫాలో కావాలని అన్నారు. 2023లో పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని స్టాండ్స్ ‌తీసుకొని ఫాలో అవుతే చాలని తెలిపారు. తాము గవర్నర్‌ అపాయింట్మెంట్‌ ‌ముందే కోరాం కానీ అక్కడి నుంచి స్పందన రాలేదని, తమిళనాడు గవర్నర్‌కి కొరొనా పాజిటివ్‌ ‌వచ్చినా ఇలాంటి పరిస్థితి లేదని తెలిపారు.

పార్టీ పటిష్టంగా ఉండాలంటే నేతల మధ్య యూనీటి ఉండాలని, టీఆరెస్‌ ‌పార్టీ నిధులపై ఎన్నికలకు వెళ్తే, కాంగ్రెస్‌ ‌ప్రజలపై నమ్మకంతో వెళ్తదని అన్నారు. కాంగ్రెస్‌లో గ్రూపులు అనేది క్రికెట్‌ ‌టీమ్‌ ‌లాంటిదని, అందరూ టీమ్‌ ‌కోసం మాత్రమే అడుతారని, కాంగ్రెస్‌లో కూడా నేతలందరూ పార్టీ కోసమమే పని చేస్తారని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎప్పటికీ యువ నాయకత్వం వస్తూనే ఉంటుందని, తెలంగాణ లో 28లక్షల  రైతు కుటుంబాలు ఉన్నాయని వారికి  కేసీఆర్‌- ‌మోడీ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ మార్పుపై తాను ఎమీ చెప్పలేననీ, మార్పు అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, 2014-2018 ఎన్నికల్లో జరిగిన విషయాలను నెమరేస్తూ రాబోయే ఎన్నికల్లోకి వెళ్తామని అన్నారు. తాను వచ్చి కొన్ని రోజులే అవుతుందని. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ఒక్కరినీ కలుస్తానని అన్నారు. తమిళనాడు లోని తన నియోజవర్గమంలో చాలా మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారని తెలిపారు. తమిళనాడు-తెలంగాణ రాజకీయాలు వేరు కాదనీ, ఎందుకంటే ఎమోషనల్‌ ‌రాష్ట్రాలేనని అన్నారు. ఎన్నికల్లో విజయాలు రావాలంటే ప్రతిసారి ఒకే స్ట్రాటజీ ఉపయోగపడదని, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు వ్యవహరిస్తూ ఉండాలని నాయకులకు సూచించారు.

Leave a Reply