Take a fresh look at your lifestyle.

కలలు మనసు కల్లోలం…

కలల ప్రపంచం చాలా అద్భుతమైనది. కలలు జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే మనకు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కలల ద్వారా తీరుతుంటాయి.మనకు భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించి కూడా కలలు వస్తాయి. కలలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. మనము నిద్రలో ఉండే సమయంలో బ్రెయిన్‌ మనకు కలలను ప్రాసెస్‌ చేస్తుంది. మన బ్రెయిన్‌ అత్యంత శక్తివంతమైనది. భవిష్యత్తులో ఎలా జీవించాలో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలా జాగ్రత్త పడాలో కొన్నిసార్లు బ్రెయిన్‌ కలల ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇది నాణేనానికి ఒక వైపు మాత్రమే.
నిద్ర – కలలు: వ్యక్తులలో నిద్ర 5 దశలుగా ఉంటుంది. మొదటి దశలో కళ్ళు మూస్తాము. రెండో దశలో మన కళ్ళ కదలిక ఆగిపోతుంది. మూడవ దశలో మెల్లగా గాఢ నిద్రలోకి జారుకుంటాం. నాలుగో దశలో గాఢనిద్రలో ఉంటాం. ఐదో దశను రాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ స్టేజ్‌ అంటారు. ఈ దశలోనే మనకు కలలు వస్తాయి.కలలు రకాలు: సాధారణ కలలు: ఇవి ప్రతి రోజూ వస్తుంటాయి. యవ్వన కలలు:యవ్వనంలో ఎక్కువగా వస్తాయి. నిద్రపోయే ముందు ఎలాంటి కలలు రావాలనుకుంటే అలాంటి కలు రావడం జరుగుతుంది. ఈ కలలు చాలా వాస్తవ పరిస్తితులకు దగ్గరగా ఉంటాయి.సందర్శనకలలు: చనిపోయిన మన ఆత్మీయులు కలలో కనిపించడాన్ని సందర్శన కలలు అంటారు. సాధారణంగా వారు మనకు శుభవార్తలు చెప్పడానికి లేదా రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరించడానికి అప్పుడప్పుడూ కలలోకి వస్తుంటారని ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తారు.

పగటి కలలు: వ్యక్తులు  కల్పితంగా ఊహించడంతో పగటి కలలు కంటారు. పగటి కలలు జీవితానికి చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఫాంటసీ లో ఉండటం మూలంగా వారికి తీరని కోరికలు తీరుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మంచి అనుభూతి పొందటానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ అవసరం బట్టి ఈ ఫాంటసీలో జీవిస్తారు. ఇటువంటి ఫాంటసీ వలన మనిషి యొక్క ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. పగటి కలలతో లాభం ఎంతో నష్టం అంతే ఉంటుంది.
బ్రాంతి: బ్రాంతి అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించడం. యువకులు అమ్మాయిల పట్ల ఊహించుకోవడం. దీనిని మతి భ్రమణం అని కూడా అంటారు. ప్రతి ఒక్కరూ భ్రాంతి  తో వారి మనసులో సంతోషంగా విహరిస్తూ ఉంటారు. ఇది ఒక ఊహాత్మక అనుభవం. మన యొక్క భ్రాంతి కూడా కొన్నిసార్లు కలల రూపంలో వస్తాయి.

భ్రమ: కళ్ళు పంపే సమాచారాన్ని మన మెదడు  తప్పుగా అర్థం చేసుకోవడమే భ్రమ అంటారు. ఈ భ్రమలు కూడా కలల రూపంలో వస్తాయి.ఈ భ్రమలే మాయగా అనిపిస్తాయి. మనలో చాలామంది భ్రమలతో జీవించేస్తుంటారు. పీడ కలలు (నైట్‌ మేరేస్‌): కొన్ని సార్లు భయంకరమైన కలలు రావడం జరుగుతుంది. ఎవరిలో ఐతే ఆందోళన, అలజడి, ఆత్రుత, కొత్త పరిణామాలు సంభవించడం, నెగిటివ్‌ గా ఆలోచించడం జరుగుతుందో వారికి ఇలాంటి కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలను తప్పించుకోవాలంటే ఒత్తిడి రహిత పరిస్తితులను సృష్టించుకోవాలి. పాజిటివ్‌ ఆలోచనలును అభివృద్ధి చేసుకోవాలి.

నిద్రలో ఏడవడానికి ప్రధాన కారణాలు పీడ కలలు: కన్నీళ్లతో లేచేందుకు ఒక కారణం పీడకలలు. ఇవి బాధాకరమైన, ఆత్రుత లేదా భయపెట్టే అంశాలను కలిగి ఉంటాయి. మానసిక ఒత్తిడిని పెంచుతాయి.  మానసిక గాయం: ప్రస్తుతం లేదా గతంలో మానసిక గాయానికి గురైన వ్యక్తులు అణచివేయబడిన భావోద్వేగాలకు చిహ్నంగా ఏడుస్తూ మేల్కొంటారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే సైకాలజిస్టుల సహాయం తప్పనిసర్‌

సన్నిహిత వ్యక్తి మరణం: ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం వలన కలిగే ఆలో చనలు నిద్రలో కన్నీళ్లు పెట్టుకునేందుకు మరో కారణం. ఇది మానసిక ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.డిప్రెషన్‌: దీర్ఘకాలిక ఆందోళన విచారంతో కూడిన కలలకు దారితీస్తుంది. విద్రపోతున్నప్పుడు మానసిక క్షోభను సృష్టిస్తుంది. దీనిని నిరంతర మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతంగా పరిగణించాలి.భావోద్వేగాల బ్యాలన్స్‌ : కొందరు పగటి పూట తమ ఎమోషన్స్‌ ను అణచివేస్తారు. ఈ ఎఫెక్ట్‌ రాత్రి సమయంలో పడొచ్చు. ఇలా నిదలో కార్చే కన్నీటితో లేవడం.. మన సులోని భావాలను బయట పెట్టాల్సిన అవ సరాన్ని సూచిస్తుంది.
మందులు: కొన్ని మందులు నిద్ర సంబంధిత భావోద్వేగ సమ స్యలను కలిగిస్తాయి. అందుకే మెడిసిన్‌ ఉప యోగించే ముందు దాని వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి తెలుసుకోవాలి. బై పోలార్‌ డిజార్డర్‌ : విచారం అనేది బైపోలార్‌ డిజార్డర్‌ లక్షణం. విపరీతమైన మూడ్‌ ప్రక్చువేషన్స్‌ నిద్రలో ఏడుపుకు దారితీస్తాయి.

స్లీప్‌ అప్నియా: స్లీప్‌ అప్నియా, ఇన్సోమ్నియా, రెస్ట్స్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌ నిద్ర రుగ్మతలకు కొన్ని ఉదాహ రణలు. ఇవి స్లీప్‌ సైకిల్‌ కు భంగం కలిగిం చవచ్చు. మేల్కొన్నప్పుడు మానసిక వేదనను కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన నిద్రకు చిట్కాలు: రాత్రి పూట తీసుకునే ఆహారం  నిద్రా సమయం కంటే  రెండుగంటల ముందుగా తీసుకోవాలి.  మనం పడుకొనే సమయం వరకు ఆహారం సగం జీర్ణం కావాలి.  నిద్ర పోవాలనే సమయానికంటే అరగంట ముందుగానే  ఎలక్ట్రానిక్‌/సమాచార ఉపకరణాలకు (టీవీ, కంప్యూటర్‌, టాబ్‌, మొబైల్‌) ముఖ్యముగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.  ప్రతీ రోజూ ఒకేవేళకి నిద్రపొవడం అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కాదని, ఆలోచనా విధానంలో మార్పుతోనే పరిష్కారం సాధ్యం. సహజ సిద్ధంగా లభించే నిద్రను ఆస్వాధించండి. చక్కటి ఆరోగ్యంతో జీవించండి. నిద్రలేమి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే దగ్గరలోని సైకాలజిస్ట్‌ ద్వారా కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరఫీ (సి.బి.టి.) చికిత్స ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు.            ి

 -డా.అట్ల
 శ్రీనివాస్‌ రెడ్డి,  స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రిహాబిలిటేషన్‌, సైకాలజిస్ట్‌
ఫ్యామిలీ కౌన్సెలర్‌
సెల్‌: 9703935321

Leave a Reply