Take a fresh look at your lifestyle.

పక్క రాష్ట్రాల్లో మళ్లీ కొరోనా విజృంభణ

  • ఆందోళనలో సరిహద్దు జిల్లాల ప్రజలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటెల హితవు 
పక్క  రాష్ట్రాల్లో మరోమారు కొరోనా విజృంభించడంతో తెలంగాణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్‌ ‌తదితర ప్రాంతాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న తీరుతో  ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కనపడుతోంది. అయితే చుట్టుపక్క రాష్ట్రాల్లో కొరోనా విజృంభిస్తుంటే.. సరిహద్దుల్లో అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యన్ని ప్రదర్శిస్తోందని అంటున్నారు.  గత ఏడాది కొరోనా మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇలాగే అవగాహనా రాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ప్రభుత్వం విమర్శలకు గురైంది. వందలాది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారంటూ ప్రజలు ప్రభుత్వాన్ని దోషిగా చూశారు.
మళ్లీ ఇప్పుడు కూడా  ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోంది. మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్‌ ‌మూడు రాష్ట్రాల్లో కొరోనా కేసులు పెరిగాయి. ఈ మూడు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాయి. అయినా సరిహద్దుల్లో వచ్చేవారిని ఆపి పరీక్షలు చేయడం లాంటి చర్యలు చేపట్టడంలేదు. చెక్‌ ‌పోస్టుల దగ్గర టెస్టులు చేయడంలేదు. అయితే టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశాలు మాత్రం జారీ చేసింది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ అం‌దరికీ అందేలా చూడాలని మంత్రి ఈటెల రాజేందర్‌ ‌వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రాక్టికల్‌గా సరిహద్దుల్లో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. చెక్‌ ‌పాయింట్లు పెట్టి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

Leave a Reply