Take a fresh look at your lifestyle.

ఎపిఎస్పీ బెటాలియన్‌లో పలువురికి కరోనా

గన్నవరంలో డ్యూటీ చేస్తున్న వారికి పాజిటివ్‌
శ్రీ‌కాకుళంలో టెస్ట్ ‌రిపోర్టులు రాక ఆర్మీ ఆందోళన

అమరావతి,జూలై 11 : ఏపీలో కరోనా వైరస్‌ ‌తీవ్రంగా వుంది. ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, గన్‌ ‌మెన్లు డ్రైవర్లు కరోనా వైరస్‌ ‌బారినపడుతున్నారు. తాజాగా గన్నవరం విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విశాఖపట్నం ఏపిఎస్పి 16 బెటాలియన్‌ ‌సిబ్బంది సుమారు 50 మంది గన్నవరం విమానాశ్రయం గత కొద్దిరోజులుగా డ్యూటీ చేస్తున్నారు. వీరిలో కొంతమందికి పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో వారందరిని ఐసోలేషన్‌ ‌కి తరలించారు. మిగత సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించి విశాఖకు తరలించారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా ఎఫెక్ట్ ‌భయపెడుతోంది. డిప్యూటీ సిఎం నారాయణస్వామి చిన్నల్లుడికి కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. కెనడా నుంచి వచ్చిన నారాయణ స్వామి చిన్నల్లుడు హోం ఐసోలేషన్‌లోకి నారాయణస్వామి వెళ్లారు. అలాగే, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌ ‌మెన్‌కి కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. గన్‌మెన్‌కు పాజిటివ్‌ ‌రావడంతో హోం ఐసోలేషన్‌ ‌లోకి వెళ్లిన రోజా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలో హోం ఐసోలేషన్‌ ‌రోగులు పెరుగు తున్నారు. కరోనా పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ ‌గా తేలిన వ్యక్తులను కరోనా తీవ్రతను బట్టి హోమ్‌ ‌క్వారంటైన్‌ ‌లేదా, ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
హోమ్‌ ‌క్వారంటైన్‌ ‌లో ఉండే వ్యక్తులు తమకు కావాల్సిన మెడిసిన్స్, ‌శానిటైజర్లు వంటి వాటికోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. దీని వలన వీరి నుంచి మరికొంతమందికి కరోనా సోకే అవకాశం ఉంటుంది. అందుకే ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉండే వాళ్ళకోసం ప్రత్యేకంగా హోమ్‌ ‌క్వారంటైన్‌ ‌కిట్స్‌ను తయారు చేసింది. వీటిని హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉండే వారికి అందిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఆర్మీ జవాన్లు సైతం పెద్ద సంఖ్యలో ఈ మాయదారి వైరస్‌ ‌బారినపడ్డారు.. కాగా, ఆర్మీ జవాన్లు క్వారంటైన్‌ ‌సెంటర్‌లో ఆందోళనకు దిగిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.. వివరాల్లోకి వెళ్తే.. నెల రోజుల సెలవుపై వచ్చిన జవాన్లకు కరోనా టెస్టుల అనంతరం క్వారంటైన్‌కు తరలించారు అధికారులు..ఆ టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్టులు రాగానే ఇంటికి పంపిస్తామని చెప్పి.. సంతబొమ్మాళి మండంలం లక్ష్మీపురం క్వారంటైన్‌ ‌కేంద్రంలో ఉంచారు.. అయితే..వారం రోజులు గడిచినా రిపోర్టులు రాలేదని చెబుతు న్నారు అధికారులు.. దీంతో.. లక్ష్మీపురం క్వారంటైన్‌ ‌కేంద్రం దగ్గర 80 మంది ఆర్మీ జవాన్లు ఆదోళనకు దిగారు.. వారం రోజులు గడిచినా విషయం చెప్పకపోవడం..ఇంటికి పంపకపో వడంపై నిరసన వ్యక్తం చేశారు.. కనీస వసతి లేదని.. భోజనం సరిగా లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్మీ జవాన్లు.

Leave a Reply

error: Content is protected !!