Take a fresh look at your lifestyle.

ట్రాఫిక్ నిబంధన గురించి అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ రామకృష్ణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:ఇర్కోడ్ గవర్నమెంట్ హై స్కూల్  విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల గురించి, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటిస్తే  70% రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు.మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్ట  ప్రకారం కేసులు నమోదు చేస్తాం.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.వాహనదారులలో మార్పు వస్తే ప్రమాదాలు తగ్గించడం సులువువిద్యార్థి దశ నుండే రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిది.సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ… పోలీస్ కమిషనర్  ఆదేశానుసారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు  మైన డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే  ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపవద్దని తెలిపారు. మరియు కారణము లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమే వాహనదారులు తప్పకుండా రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని  సూచించారు. వేగంగా వెళ్లే వాహనానికి, సాధారణ స్పీడ్ తో వెళ్లే వాహనానికి తేలిక 15 నిమిషాలు మాత్రమే తేడా ఉంటుందని తెలిపారు.మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని  దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు. నిద్రలేమి తనము ఓవర్ స్పీడ్, అజాగ్రత్తగా,   వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు పార్కు చేయవద్దని తెలిపారు.జరిమానా ఫైన్లు వేయడం మా అభిమతం కాదని  ప్రమాదాల నివారణ గురించి  రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని  సూచించారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన సిగ్నల్స్ మరియు నిబంధనలు ఎలా పాటించాలి అనే అంశంపై సిగ్నల్స్ చూపిస్తూ అవగాహన కల్పించారు.స్పీడ్ లేజర్ గన్ ఏ విధంగా పనిచేస్తుంది, మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది తదితర అంశాల గురించి  ప్రాక్టికల్ గా చూపించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ పర్శరాములు,  అధ్యాపకులు విద్యార్థినీ, విద్యార్థులు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply