మరో మూడు మెడికల్ కాలేజీలకు అనుమతి
త్వరలో మరో ఆరు మెడికల్ కాలేజీలకు కూడా..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత 240 శాతం పెరిగిన మెడికల్ సీట్లు
డిశ్చార్జీ అయిన పేషెంట్లకు మందులు ఇచ్చి పంపాలి
త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ పూర్తి
టీచింగ్ హాస్పిటళ్ల నెలవారీ సమీక్షలో మంత్రి హరీష్ రావు
రాబోయే రోజుల్లో క్యాత్ లాక్ సేవలు
లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు
ఆరోగ్య మహిళ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించాలి
సిపిఆర్ పై అందరికీ అవగాహన కల్పించాలి
జెడ్‌పి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : ప్రభుత్వ హాస్పిటళ్లల్లో ఉచితంగా అందిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా పరిషత్ జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో వైద్య ఆరోగ్యం, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల శాఖలకు సంబంధించి చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ హాస్పిటళ్లను బలోపేతం చేసి, అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వొచ్చిందన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోనీ అన్ని నియోజకవర్గాలలో హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్యను పెంచామన్నారు. గర్భిణీల కోసం జిల్లా హాస్పిటల్‌లో టిపా స్కాన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. హాస్పిటళ్లలో డాక్టర్లను భర్తీ చేశామని, త్వరలో ఒక్క ఖాళీ లేకుండా నర్సులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెలలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.