Take a fresh look at your lifestyle.

సకల ఆధిపత్యాలను ధిక్కరించిన హక్కుల పతాక అగ్నివేష్

ఇంటర్నెట్ డెస్క్,ప్రజాతంత్ర: నమ్మిన విలువల కోసం తాను ఎంచుకున్న సిద్ధాంతం కోసం నిరంతరం సామాజిక ఉద్యమాలలో క్రియాశీలకంగా పనిచేసిన నిరంతర ఉద్యమకారుడు అగ్నివేశ్ ని ప్రొఫెసర్ హరగోపాల్ కొనియాడారు. కాషాయ వస్త్రాలు కు కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి అగ్నివేష్ అని అభిప్రాయపడ్డాడు. తెలంగాణ ఉద్యమానికి కి ఏవిధంగానైతే మద్దతుగా నిలిచినడో పౌరహక్కుల ఉద్యమానికి కూడా అండగా నిలబడినాడని,అగ్నివేష్ వాస్తవాలు మాట్లాడేవాడు కాబట్టే అతనిపై మతతత్వ శక్తులు భౌతిక దాడులు చేసేవని అయినా ఆయన ఎక్కడ వెనుకడుగు వేయకుండా నమ్మిన విశ్వాసాల కోసం నిలబడినాడని వారన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నొక్కి చెప్పిన మహనీయుడు అగ్నివేష్ అని కొనియాడారు దేశం లోపల ఉన్నటువంటి వెట్టిచాకిరి , మద్యపానం నిషేదించబడాలంటే బలమైన పౌర వేదికలు ఉండాలని అగ్నివేష్ అనేకసార్లు నొక్కి చెప్పాడని తెలిరచేశారు. ఆదిపత్యాన్ని ఎదిరించాలి అంటే వ్యక్తి తన అహాన్ని తగ్గించుకోవాలని అందుకు నిదర్శనం అగ్నివేష్ అని పేర్కొన్నారు. నిజాలు నిక్కచ్చిగా మాట్లాడే అగ్నివేష్ పై కొన్ని శక్తులు చేసిన దాడులవల్లె కోలుకోలేని స్థితికి చేరుకొని ఈరోజు అగ్నివేష్ మన నుంచి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.అగ్నివేశ్ కొనసాగించిన ప్రజాస్వామిక సంస్కృతిని ముందుకు తీసుకు పోవాల్సిన బాధ్యత తెలంగాణ విద్యావంతుల వేదిక పై ఉందని ఆయన సూచించారు.

భారతీయ సమాజం లోపల ఎక్కడ సమస్య తలెత్తినా అక్కడికి వెళ్లి అగ్నివేష్ తన వాణిని వినిపించే వాడని విఠల్రావు ఆర్య కొనియాడారు విద్యార్థుల ఉపాధ్యాయుల దళితుల ,ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అగ్నివేష్ దేశంలోని అన్ని రాష్ట్రాలలో అనేక పోరాటాలు చేసి చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా బాలల హక్కుల కోసం ముఖ్యంగా పీడుతుల పక్షాన నిలబడి ఈ దేశంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించిన ఆచరణ శీలి అగ్ని వేశ్ అని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ గారు అభిప్రాయపడ్డారు. స్వామి అగ్నివేష్ అంటే లౌకిక తత్వానికి ప్రతీక అని మానవ హక్కుల వేదిక నాయకులు జీవన్ కుమార్ కొనియాడారు. ఆధ్యాత్మికత అంటే మానవ హక్కులను ప్రతిబింబించేలా ఉండాలని అగ్నివేష్ పదే పదే వెలిబుచ్చేవాడని వారన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అస్తిత్వ ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడిన వ్యక్తి అగ్నివేష్ అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క కొనియాడారు. పుట్టిన ప్రాంతానికే కాకుండా తనలో విశాల భావజాలాన్ని నింపుకొని నిర్భయంగా, నిక్కచ్చిగా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్లేవాడని తెలియచేసారు.

సి పి ఎమ్ ఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కే గోవర్ధన్ మాట్లాడుతూ ఆదివాసి ప్రజల పక్షాన నిలబడిన అగ్నివేష్ పోరాటం వెలకట్టలేనిది వారన్నారు. దేశవ్యాప్తంగా సారాను నిషేధించాలని దీనికోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని,అందు కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించాలని అగ్నివేష్ అనేక వేదికలపై ప్రసంగించిన విషయాన్ని గుర్తు చేశారు. స్వామి అగ్నివేష్ సంస్మరణ సభకు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటీ నాగయ్య అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య పాలమూరు అధ్యయన వేదిక నాయకులు రాఘవాచారి టివివి రాష్ట్ర నాయకులు విశ్వ,విజయ్ కుమార్,కృష్ణ ,పందుల సైదులు మరియు వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!