Take a fresh look at your lifestyle.

చెరువులను మింగిన మల్లారెడ్డి

•అధికారులు చర్యలెందుకు తీసుకోరు
•మేడ్చల్‌కు ఐటి కంపెనీల హామీని తుంగలో తొక్కారు
•అటకెక్కిన డంపింగ్‌ ‌యార్డ్ ‌సమస్య
•కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరుగ్యారంటీలతో పేదలను ఆదుకుంటాం
•జవహర్‌ ‌నగర్‌ ‌సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌చెరువుల పక్కన భూములు కొని… చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం మేడ్చల్‌ ‌నియోజక వర్గం పరిధిలోని జవహర్‌ ‌నగర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ‌విజయ భేరి సభలో రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…పేదలపై ప్రతాపం చూపే అధికారులు.. .చెరువులను మింగిన మల్లారెడ్డిపై చర్యలెందుకు తీసుకోరని ప్రశ్నించారు. నియోజకవవర్గంలో మల్లారెడ్డి పేదోళ్ల గుడిసెలు కూల్చి వారికి నిలువ నీడ లేకుండా చేసిండని విమర్శించారు. జవహర్‌ ‌నగర్‌ ‌నుంచి డంపింగ్‌ ‌యార్డ్‌ను తరలించేందుకు కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొ చ్చినా కూడా ప్రభుత్వం తరలించలే దన్నారు. కేసీఆర్‌, ‌మల్లారెడ్డి తొడుదొంగల్లా దోచుకుం టున్నారని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్‌ ‌మళ్లీ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చాడు…• •సీఆర్‌ ఎన్ని వందల కోట్లకు టికెట్‌ అమ్ముకున్నారని ప్రశ్నించారు. మేడ్చల్‌కు ఐటీ కంపెనీలు తెస్తామన్న హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. జవహర్‌ ‌నగర్‌ ‌డంపింగ్‌ ‌యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్‌ ‌లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిందని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ‌పాలనలో తెలంగాణ ఆగమైందని, ఆగం చేసిన కేసీఆర్‌ ‌ను పొలిమేరలు దాటే వరకు తరమాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని, ఈ ధరలు, ఈ పాలనతో బతికే పరిస్థితి లేదని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.  కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు రేవంత్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొస్తే పేదలను ఆదుకుంటామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ.2500 అందిస్తామన్నారు. రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పాలనలో రూ.400గా ఉన్న గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఇప్పుడు రూ.1200కు చేరుకుందన్నారు. తాము అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పనికి వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.12వేలు అందిస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు.
మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎందుకు రాలేదు
పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆరెస్‌ ‌మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం మేడ్చల్‌లో కాంగ్రెస్‌ ‌విజయ భేరి సభలో మాట్లాడుతూ…పేదోళ్ల బిడ్డలు చదువుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని, అందుకే డిగ్రీ కాలేజీ ఇవ్వలేదని మండిపడ్డారు. మంత్రిగా ఉన్నా మాల్లారెడ్డితో నియోజకవర్గానికి ఎటువంటి ప్రయోజనం కలుగలేదన్నారు. మేడ్చల్‌ ‌నియోజకవర్గంలో కాంగ్రెస్‌  ‌హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప బీఆరెస్‌ ‌చేసిందేం లేదని విమర్శించారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తెచ్చిందే కాంగ్రెస్‌ ‌పార్టీ అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్‌ ‌పరిస్థితి ఏంటని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆరెస్‌ ‌పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌.. ‌మళ్లీ మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని వస్తుండు అన్నారు. ఈ ఎన్నికలు దేశ చరిత్రను మలుపు తిప్పివి అన్నారు. ఇవి దొరల తెలంగాణకు… ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు..దొరల తెలంగాణ కావాలో.. ప్రజా తెలంగాణ కావాలో తేల్చుకోండన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మేడ్చల్‌ ‌కు డిగ్రీ కాలేజీ, వందపడకల హాస్పిటల్‌ ‌తెచ్చే బాధ్యత మాదన్నారు రేవంత్‌ ‌రెడ్డి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.
కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లు
మేడ్చల్‌ ‌నియోజకవర్గం పరిధిలోని బొడుప్పల్‌ ‌మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు గురువారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ ‌లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన వారిలో 23 డివిజన్‌ ‌కార్పొరేటర్‌ ‌రాసాల వెంకటేష్‌ ‌యాదవ్‌, ఒకటవ డివిజన్‌ ‌కార్పోరేటర్‌ ‌బింగి జంగయ్య యాదవ్‌,13 ‌వ డివిజన్‌ ‌కార్పోరేటర్‌ ‌దానగళ్ల అనితా-యాదగిరి, 20 వ డివిజన్‌ ‌కార్పోరేటర్‌ ‌జడిగే మహేందర్‌ ‌యాదవ్‌,24 ‌వ డివిజన్‌ ‌కార్పోరేటర్‌ ‌గుర్రాల రమా వెంకటేష్‌ ‌యాదవ్‌ ఉన్నారు.
కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరికలు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్‌లో చేరిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి రాఘవరావు, మహబూబాబాద్‌ ‌నియోజకవర్గానికి చెందిన పిఏసిఎస్‌ ‌చైర్మన్‌ ‌చల్లా లింగా రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ ‌లోని తన నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply