Take a fresh look at your lifestyle.

జగనన్న విద్యా దీవెన

  • కొత్త పథకానికి శ్రీకారం
  • దాదాపు 12లక్షల మంది విద్యార్థులకు లబ్ది
  • విద్యార్థుల ఖర్చులన్నీ చెల్లించేలా రూపకల్పన
  • గత బకాయిలు రూ.1880 కోట్లు కూడా పూర్తిగా చెల్లిస్తాం
  • ఏపీలో విద్యారంగంలో భారీ సంస్కరణలు
  • వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రకటించిన సిఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో భారీ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులకు అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించే విధంగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ’జగనన్న విద్యా దీవెన’ పథకం పేరుతో రూపకల్పన చేసిన ఈ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్‌ ‌కార్యాలయంలో సీఎం జగన్‌ ‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు 12లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం.. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో మాట్లాడారు. విద్యా దీవెనలో భాగంగా రెండు పథకాలు తీసుకొచ్చామనీ, ఇందులో భాగంగా బోర్డింగ్‌, ‌లాడ్జింగ్‌..‌పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదవే అని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌పేర్కొన్నారు. మంచి చదువుతోనే పేదల బతుకులు మారుతాయి. మార్చి 31వరకు ఉన్న పూర్తి బకాయిలను ఇస్తున్నాం. 2018-19లో గత ప్రభుత్వం పెండింగ్‌ ‌పెట్టిన రూ.1880 కోట్లు పూర్తిగా చెల్లిస్తున్నట్లు కూడా సిఎం వెల్లడించారు. ఈ ఏడాదికి సంబంధించి ఒక్క పైసాకూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నాం. 2020-21లోనూ ప్రతి తైమ్రాసికం తర్వాత తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తాం. కళాశాలల్లో సదుపాయాలు లేకపోతే 1902కు తల్లులు ఫోన్‌ ‌చేయవచ్చని సీఎం వివరించారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనీ, ఇంతకు ముందు తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారనీ, ఆ తరువాత •ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని సీఎం జగన్‌ ‌గుర్తుచేశారు. బోర్డింగ్‌, ‌లాడ్జింగ్‌ ‌కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌కింద రూ. 4 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌ అం‌దజేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలను కూడా పీజు రీయింబర్స్‌మెంట్‌ ‌పథకం కింద ఆయా కళాశాలలకు చెల్లించినట్లు వెల్లడించారు.

పెద్ద చదువులు చదవగలిగితేనే పేదరికం పోతుందని, అప్పులు పాలు కాకుండా పెద్ద చదువులు చదివితేనే పేదవాళ్ల తలరాతలు మారుతాయని, బతుకులు మారుతాయని నాన్నగారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలో నాన్నగారు ఉన్నప్పుడు ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ పూర్తి భరోసా ఉండేది. సీఎం స్థానంలో మనసున్న మహారాజు ఉండేవాడని ఒక భరోసా ఉండేది. ఆయన చనిపోయాక ఈ పథకాన్ని పూర్తిగా నీరుగారుస్తూ పోయారు. చాలీచాలని ఫీజులు ఇవ్వడం, ఇచ్చామంటే ఏదో ఇచ్చామన్నట్లుగా ఇవ్వడం చేశారు. ఫీజులు ఎలా ఇవ్వాలన్న ఆలోచన కాకుండా ఎలా కత్తిరించాలి.. అని ఆలోచన చేసి.. చాలీచాలని ఫీజులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్‌ అనే ఒక తండ్రి.. తన ఇంటి ముందు తన కొడుకు ఫొటో పెట్టి, ప్లెక్సీ పెట్టి నివాళులు అర్పిస్తున్నాడు. అప్పుడు నేను.. ఏమైందన్నా అని అడిగా. అప్పుడు ఆ తండ్రి బాధపడుతూ చెప్పిన విషయాలు ఎప్పుడూ కూడా నేను మరిచిపోలేనని జగన్‌ ‌వెల్లడించారు. ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వస్తే.. ఇంజినీరింగ్‌ ‌చదువుతానంటే కాలేజీలో చేర్పించా. కానీ చాలీచాలని ఫీజులు ఇచ్చేవారు, మరోవైపు బోర్డింగ్‌ ‌మెస్‌ ‌ఛార్జీలు కలిపితే లక్ష రూపాయలు దాటే పరిస్థితి. బాలెన్స్ ‌ఫీజు ఏం చేస్తావు నాన్నా అని నా కొడుకు అడిగాడు. కొన్ని రోజులుగా అప్పో సప్పోచేసి.. చదవించా. సెలవులకు ఇంటికి రాగానే.. మళ్లీ నా కొడుకు అదే ప్రశ్నలు వేశాడు. ఏదో ఒకటి చేసి చదివిస్తా అన్నాను. కానీ తన చదువు కోసం కొవ్వొత్తిలా తండ్రి, తన కుటుంబం కరిగి పోవడం ఇష్టం లేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తండ్రి చెప్పాడు. చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదవాడు అప్పులు పాలు అవుతున్నాడు. ఆరోజు నేను అనుకున్న కార్యక్రమాన్ని దేవుడి దయతో, అందరి ఆశీర్వాదంతో ఈరోజు చేస్తున్నాం. బోర్డింగ్‌, ‌లాడ్జింగ్‌ ‌కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకు వచ్చాం. పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే.. ఒక్క చదువులు అన్నది.. నేను వేరే చెప్పాల్సిన పని లేదు. కుటుంబంలో ఒక్క పిల్లాడైనా మంచి చదువులు చదివితే.. ఆ పిల్లాడికి మంచి జీతం వస్తుంది, మన బతుకుల మారుతాయి. ఈ దిశగానే అడుగులు వేస్తే.. మొట్టమొదటి సారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మార్చి 31 వరకూ ఉన్న పూర్తి బకాయిలను ఒక్క రూపాయి కూడా పెండింగులో పెట్టకుండా ఇస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 2018-19లో గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లిస్తూ, అలాగే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు తైమ్రాసికాలకు ఇస్తున్న డబ్బులు అన్నీ కలిపి ఒక్క పైసా కూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply