Take a fresh look at your lifestyle.

బొల్లారంలో కదిలి వచ్చిన గులాబీ దండు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21:  అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన బొల్లారం మున్సిపాలిటీని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తిచేశారు.మంగళవారం బొల్లారం మున్సిపల్ పరిధిలో  నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రోడ్ షో లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో వివిధ కాలనీలలో నిర్వహించిన రోడ్ షో కి ప్రజల నుండి  అనూహ్య స్పందన  లభించింది.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే బొల్లారం మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. దశాబ్దాలకాలంగా అపరిస్కృతంగా  ఉన్న ఇంటింటికి రక్షిత మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు.అర చేతిలో వైకుంఠం చూపించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించవద్దని కోరారు. 11సార్లు నమ్మి అధికారం అప్పగిస్తే చేసింది ఏమీ లేదని అన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని తెలిపారు.భవిష్యత్తులో మరింత అభివృద్ధి కొనసాగాలంటే నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పులగుర్ల సంతోష మహేందర్ రెడ్డి బొల్లారం మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు  పులగుర్ల సంతోష మహేందర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి మంగళవారం బొల్లారంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోలన్ రోజా బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply