- బోర్డుల పరిధి నిర్ణయాన్ని స్వాగతించిన బండి సంజయ్
- ఇద్దరు సిఎంలు కవి•షన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని మండిపాటు
- నీటి వివాదాలు పెరగకుండా నోటిఫై : ఎమ్మెల్యే రఘునందన్ రావు
కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతామని హెచ్చరించారు. రెండు రాష్ట్రాల సీఎంలు కవి•షన్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. 2015 ఒప్పందం ప్రకారం తెలంగాణకి 575 టీఎంసీలు రావాల్సి ఉంటే.. ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంల హైడ్రామా చేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. కృష్ణ జలాలపై కేంద్ర జలశక్తి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని బండి స్వాగతించారు. అదే విధంగా కృష్ణా జలాలపై సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తాము కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన..
రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎంల బండారం బయట పడుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం అడ్డుకోవడానికి కేంద్రం నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదు.. అందుకే జగన్ దోచుకుపోతున్నారన్న ఆయన.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కృష్ణ పరివాహన ప్రాంతం 68 శాంతం ఉంటే.. తెలంగాణకి 575 టీఎంసీ నీరు రావాల్సిన ఉంటే.. 299 టీఎంసీల నీరు ఎలా ఒప్పుకున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కమిషన్ల కోసం పక్క రాష్ట్రంతో కుమ్మక్కయ్యారని ఆరోపించిన ఆయన.. బహిరంగంగా ఎవరి వాటా ఎంత అనేది తాము చెబుతున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సీఎం లెటర్ రాశారు.
మరి సుప్రీమ్ కోర్టులో కేసు వేస్తే ఎలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని ఆ కేసును కూడా 8 నెలల తరువాత వాపస్ తీసుకున్నారని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్‌కు పాల్గొనేందుకు సమయం లేదంటూ వాయిదా వేయించారని ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. కానీ, తెలంగాణకు అన్యాయం జరిగితే తప్పకుండా బీజేపీ అండగా ఉంటుందన్నారు. అంతా హుజురాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల హైడ్రామా..? అని ఆరోపించారు.
నీటి వివాదాలు పెరగకుండా నోటిఫై : ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పెరగకుండా.. కృష్ణా, గోదావరి బోర్డులను కేంద్రం నోటిఫై చేసిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. దీన్ని నీటి కేటాయింపులుగా చూడొద్దని..బోర్డుల ద్వారా జరిగే నిర్వహణగా చూడాలన్నారు. నీటి విషయంలో బీజేపీని బద్నాం చేయాలని టీఆర్ఎస్ చూస్తుందన్నారు. ఏపీకి 66 శాతం, తెలంగాణకి 34 శాతం నీటి వాటాకు గతంలో హరీష్ ఒప్పుకున్నారన్నారు. ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి మెహం చెల్లడం లేదని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోలేదన్నారు. కేంద్రం జోక్యం తర్వాత మాటమార్చి సుప్రీమ్ కోర్టుకు వెళ్తామంటున్నారని రఘునందన్ పేర్కొన్నారు.