Take a fresh look at your lifestyle.

ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో.. కేంద్రంలో మంత్రులకు బాధ్యతలు అప్పగించరా?

“కేంద్ర ప్రభుత్వం 15 మంది కేంద్ర మంత్రులకు  జిల్లాల్లో  నిత్యావ సర వస్తువుల కొరత లేకుండా చూసే బాధ్యత అప్పగించింది. ఈ కమిటీల్లో మంత్రులు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం చేత నియమింపబడిన వారు. కోవిడ్‌-19   ‌నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించింది.ఈ లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో నిత్యావసరాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయాల్లో కేంద్రం బాధ్యత అప్పగించిన మంత్రులకన్నా అధికారుల అధికారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రెండు వర్గాలూ సమన్వయంగా పనిచేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది.”

భారత దేశం ఎన్నడూ లేని రీతిలో గడ్డు పరిస్థితినీ, సవాళ్ళనూ ఎదుర్కొంటోంది. దీనికి బాధ్యులు ఎవరు.. ఇప్పుడు పరిపాలన ఎవరు సాగిస్తున్నారు? ప్రజాప్రతినిధులా, అధికారులా..అన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. సాధికార కమిటీలను ఏర్పాటు చేయడం, అవి పాలనకు కేబినెట్‌ ‌వ్యవస్థను సూచించడం ఎంతో కాలంగా అమలులో ఉన్నవే. కానీ, కోవిడ్‌-19 ‌వంటి అనూహ్యమైన విపత్తులు వచ్చి పడినప్పుడు తీసుకోవల్సిన చర్యలకు ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది. కోవిడ్‌-19‌కి సంబంధించి కుప్పతెప్పలుగా సమాచారం వచ్చి పడుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందో, అవాస్తవం ఎంతో తేల్చుకోవడం పెద్ద సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌ను నడిపిస్తున్నదెవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నింటినీ మీద వేసుకుని పరిష్కరించలేరు. ప్రభుత్వంలో కార్యదర్శుల వ్యవస్థ ఉంటుంది. 2005 నాటి విపత్తు నివారణ మార్గదర్శకాలను అనుసరించి పదకొండు కమిటీలను కార్యదర్శుల నేతృత్వంలో ఏర్పాటు చేశారు. వీరంతా ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ ‌కార్యదర్శి పికె మిశ్రాకు జవాబుదారీగా ఉంటారు. ఈ కమిటీల్లో సీఈఓ నీతి ఆయోగ్‌ అమితాబ్‌ ‌కాంత్‌ ఒకదానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం శాఖ ఈ కమిటీల్లో సభ్యుల పేర్లను కూడా ప్రకటించింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళకు సరైన పరిష్కారాలను ఈ కమిటీలు సూచిస్తాయి. ఈ కమిటీలను పికె మిశ్రా పర్యవేక్షిస్తుంటారు. అమితాబ్‌ ‌కాంత్‌ ‌నేతృత్వంలోని కమిటీ ప్రైవేటు రంగంతో సమన్వయం పరుస్తూ ఉంటుంది.

ఈ సాధికార కమిటీలను ఏర్పాటు చేయడానికి ముందు హోం శాఖ కార్యదర్శి ఒక నోట్‌ను జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో సమన్వయ లోపం లేకుండా చూడాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం 15 మంది కేంద్ర మంత్రులకు జిల్లాల్లో నిత్యావ సర వస్తువుల కొరత లేకుండా చూసే బాధ్యత అప్పగించింది. ఈ కమిటీల్లో మంత్రులు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం చేత నియమింపబడిన వారు. కోవిడ్‌-19 ‌నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించింది.ఈ లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో నిత్యావసరాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయాల్లో కేంద్రం బాధ్యత అప్పగించిన మంత్రులకన్నా అధికారుల అధికారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రెండు వర్గాలూ సమన్వయంగా పనిచేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. తక్కువ ప్రభుత్వంతో మెరుగైన పాలన అందించాలన్నది మోడీ ప్రభుత్వ ముఖ్యోద్దేశ్యం. ఏప్రిల్‌ 2 ‌తేదీన కేబినెట్‌ ‌సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా జరిగింది.

కేబినెట్‌ ‌వ్యవస్థకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇది గుర్తు చేస్తోంది. కేబినెట్‌ ‌సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌హాజరు కాలేదు. ప్రధానమంత్రి దేశంలోని అగ్ర పారిశ్రామికులతో జరిపిన సమావేశానికి కూడా ఆమె హాజరు కాలేదు. పారిశ్రామికదిగ్గజాలు ముకేష్‌ అం‌బానీ, రతన్‌ ‌టాటాలతో ప్రధాని సమావేశానికి కూడా ఆమె హాజరు కాలేదు. కేవలం అధికారులను పక్కన పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం ఎలా లభిస్తుంది. 2014 నుంచి ప్రధాని మోడీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం వల్ల వారిలో నిరాశ పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదటి వీడియో కాన్ఫరెన్స్‌కు మాత్రమే హాజరయ్యారు. అధికారం పూర్తిగా కేంద్రం చేతిలో ముఖ్యంగా, ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ) చేతిలో కేంద్రీకృతం అవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రతినిది 8వ తేదీ సమావేశానికి కూడా హాజరు కాకపోవచ్చు.

పరిపాలన విషయంలో పూర్తిగా అధికారులపై ఆధారపడటం మంచిదేనా అని పలువురు పాలనా రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జనతా కర్ఫ్యూ మొదటి రోజు ఒక మంత్రి కొంతమంది సెలబ్రెటీలతో ట్విట్టర్‌లో అంత్యాక్షరి ఆడుకున్నారు. ఆయనకు ఏమీ పని లేక చేసినట్టుగా కనిపిస్తోంది. మంత్రులకు వారి బాధ్యతలను అప్పగించాలి. అప్పుడే ప్రజా ప్రభుత్వం సార్థకం అవుతుంది. అధికారులు మంచివారుండవచ్చు. వారి సలహాలను తీసుకోవచ్చు. కానీ, పూర్తిగా వారిపైనే ఆధార పడటం సరైన విధానం కాదు. ప్రధానమంత్రి మోడీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఏ విధంగా పాలనను నడిపించారో ఇప్పుడూ అలాగే నడిపిస్తున్నారు. మామూలు రోజుల్లో అయితే, పరవాలేదు. కోవిడ్‌ ‌వంటి తీవ్రమైన విపత్తు సంభవించిన సమయంలో ఈ విధానం సరైనదికాదు.
– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy