Take a fresh look at your lifestyle.

హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డిలు విమర్శించారు.మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడిని వారు ఖండించారు.బుధవారం రామచంద్రాపురం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతిపక్షాలకు ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కార్యకర్తలను రెచ్చగొడుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే హక్కు అందరికీ ఉందని తెలిపారు. దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దాడులకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. గన్ మెన్ లు లేకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోడి కత్తి డ్రామా అంటున్నారని, ఆయన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 1991లో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని దించడానికి 4వందల మందిని బలితీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. దాడులు చేయడం, హింసకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటు ఉందన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరైనా పోటీ చేయవచ్చు, ఓట్లు అడగవచ్చు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు దాడులకు పాల్పడే సంస్కృతి నేర్పలేదని, క్రమ శిక్షణ నేర్పించారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కడా జరగడం లేదని అన్నారు. పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎం చేశారో చెప్పాలి, ఎం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు ఎం చేయనున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల పాలన, బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన తేడా వ్యత్యాసం గమనించండని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో పటాన్ చెరు అభివృద్ధి జరిగిందని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గానికి నవరత్నాల పేరిట మానిఫెస్టో విడుదల చేశామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు గోవింద్, పృథ్వీరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఐలేష్, సత్యనారాయణ, నాయకులు మెరాజ్ ఖాన్, కృష్ణకాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply