Take a fresh look at your lifestyle.

భారత్‌లో బలంగా ప్రజాస్వామ్యం

  • ప్రవాసి భారతీయ దివస్‌ ‌సదస్సులో ప్రధాని మోదీ
  • వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సదస్సు ప్రారంభం
  • ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వం అండగా నిలిచిందని వెల్లడి

మానవజాతిని రక్షించేందుకు రెండు స్వదేశీ టీకాలతో భారత్‌ ‌సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మన టీకాల కోసం యావత్‌ ‌ప్రపంచం ఎదురు చూస్తుండటమేగాక, అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ‌ప్రక్రియను ఎలా నిర్వహిస్తామని ఆసక్తిగా తిలకిస్తోందని తెలిపారు. 16వ ప్రవాసి భారతీయ దివస్‌ ‌సదస్సును ప్రధాని మోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందన్నారు. ప్రస్తుతం మనం ఇంటర్‌నెట్‌ ‌ద్వారా ప్రపంచ నలుమూలలతో సంబంధాలు కలిగి ఉన్నామని, అయినా మన మనసులు మాత్రం ఎల్లప్పుడూ మాతృదేశంతోనే సంబంధాలు కలిగి ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా నాన్‌ ‌రెసిడెంట్‌ ఇం‌డియన్స్  ఇతర దేశాల్లో మరింత బలోపేతం అయ్యారని తెలిపారు. దేశంలో కొరోనా ప్రభావం మొదలైన కొత్తలో భారత్‌ ‌పీపీఈ కిట్‌లను, మాస్కులను, వెంటిలేటర్‌లను, టెస్టింగ్‌ ‌కిట్‌లను బయటి నుంచి దిగుమతి చేసుకునేదని, కానీ ఇప్పుడు ఆ విషయంలో మన దేశం స్వావలంబన సాధించిందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం మేడ్‌ ఇన్‌ ఇం‌డియాలో భాగంగా స్వదేశీ సంస్థలు తయారు చేసిన రెండు వ్యాక్సిన్‌లతో మానవాళిని రక్షించేందుకు భారత్‌ ‌సిద్ధంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. భారత్‌ ఉ‌గ్రవాదాన్ని ఎదుర్కోనేందుకు గట్టిగా నిలబడటంతో ఇప్పుడు ప్రపంచ మంతా ఉగ్రవాదాన్ని ఎదిరించే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకున్నదని ప్రధాని మోదీ తెలిపారు.

అదేవిధంగా దేశంలో అవినీతి అంతానికి భారత్‌ ‌సాంకేతికతను వినియోగిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథాకాల కింది ఇచ్చే లక్షల, కోట్ల సొమ్ము దలారుల చేతికి వెళ్లకుండా ఇప్పుడు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో పడుతున్నదని ప్రధాని పేర్కొన్నారు. ’భారత్‌కు స్వాతంత్య్ర వచ్చిన సమయంలో.. పేదదైన, అక్షరాస్యత లేని ఆ దేశం విచ్ఛిన్నమవుతుందని అన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం అసాధ్యమని భావించారు. కానీ నేడు భారత్‌ ఐక్యమత్యమున్న దేశం. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యం బలంగా, శక్తిమంతంగా, చురుగ్గా ఉందంటే.. అది భారత్‌లోనే’ అని మోదీ తెలిపారు. ఇకపోతే కొవిడ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌ ‌ముందంజలో ఉందని మోదీ అన్నారు. మహమ్మారి సమయంలో దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఉన్నారని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యధిక రివకరీ రేటు.. అతి తక్కువ మరణాల రేటు ఉన్న దేశాల్లో మనది కూడా ఒకటని తెలిపారు. మానవజాతిని కొరోనా వైరస్‌ ‌నుంచి రక్షించేందుకు ఒకటి కాదు.. రెండు స్వదేశీ టీకాలతో భారత్‌ ‌సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు భారత్‌.. ‌ప్రపంచ ఔషధ కేంద్రంగా మారిందని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న దేశాలకు మనం మందులను సరఫరా చేస్తున్నామని చెప్పారు.

ఒకప్పుడు పీపీఈ కిట్లు, ఎన్‌95 ‌మాస్క్‌లు తదితర సామగ్రిని దిగుమతి చేసుకునే మనం.. ఇప్పుడు దేశీయంగానే తయారుచేసుకునే స్థాయికి ఎదిగామన్నారు. విదేశాల్లో ఉన్న ప్రవాసి భారతీయులకు ప్రభుత్వం, దేశం ఎప్పుడూ అండగా ఉంటుంది. కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న 45లక్షల మందిని వందే భారత్‌ ‌మిషన్‌ ‌ద్వారా స్వదేశానికి తీసుకొచ్చాం’ అని మోదీ తెలిపారు. దేశంలో అవినీతిని పారదోలేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు మోదీ చెప్పారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply