Take a fresh look at your lifestyle.

బహుజన వాదం వైపు బీసిల అడుగులు

 ‘‘ఇప్పటి వరకు దేశంలో, ఇటు రాష్ట్రంలో బీసిలను కేవలం వోటు బ్యాంక్‌ ‌రాజకీయాలుగా చూసిన రాజకీయ పార్టీలకు నేడు బీసిల వోట్లు తప్పని సరి అయ్యాయి. ఎన్నో ఏళ్ళ నుండి దేశంలో అతిపెద్ద  సామాజిక వర్గంగా ఉంటూ, దేశ సంపదను సృష్ఠించడంలోను, దేశం ఐక్యతను కాపాడటంలో గాని ముందు వరసలో ఉండి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను 75ఏళ్ళుగా తమ భుజలపై మోస్తూన్న బీసిల గురించి, వీరి అభివృద్ది, సంక్షేమం, రాజ్యాధికారం గురించి గాని ఏ ఒక్క రాజకీయ పార్టీలు ఆలోచించలేదు.’’

తెలంగాణాలో రాజకీయాలు రోజురోజుకు వేడేక్కుతున్నాయి. అతి త్వరలోనే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని  రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న  అన్ని రాజకీయ పార్టీల లక్ష్యం ఒక్కటే, 2023లో ఎన్నికల్లో అధికారంలోకి రావడం. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బిసిల వోట్ల ద్వారా అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.  ఈ కార్యచరణలో భాగంగానే రాజకీయ పార్టీలు పావులు కలుపుతున్నాయి. ఉమ్మడి పాలనలో బీసిలకు రాజ్యాధికారంలో చోటు లభించలేదు. ప్రత్యేక  తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు, నిధులు, నియామకాలు, సామాజిక తెలంగాణ అనే నినాదాలు తెరపైకి రావడంతో బీసిలు ముందు ఉండి ఎన్నో త్యాగాలు, ఆత్మ బలిదానాలు, పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. కాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీసిల జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు.

నేడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని బీసీల పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో బీసీల పరిస్థితి కన్నా తెలంగాణ బీసీల పరిస్థితి కొంచెం భిన్నం. బ్రిటీష్‌ ‌పాలనలో ఉన్న సీమాధ్ర, నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి గల హక్కులు, స్వేచ్ఛ, వేర్వేరుగా ఉన్నాయి. నిజాం దోపిడీ పీడనలకు బలైంది. శ్రూదులనబడే బీసీలే. ఇక్కడి దేశ్‌ముఖ్‌లు, దొరలు, పటేల్‌, ‌పట్వారీలు, మాలీపటేళ్లు సాగించిన దౌర్జన్యకాండ అంతా భరించింది ఎదుర్కొన్నది బీసీలే (శూద్రులే) గడీల పాలనలో బీసీ స్త్రీల దౌర్భగ్యపరమైన పరిస్థితులతో పాటు అంటరానితనం, వెట్టి చాకిరి, చదువు, ఉద్యోగం వంటి అనేక విషయాల్లో నిత్యం బలయ్యింది బీసీలే.. అంతెందుకు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నది బీసీలే. హత్యలు, అవమానాలు, అత్యచారాలకు గురైంది బీసీలే. అప్పుడు అతి శూద్రులను ముట్టుకుంటే దోషమనే బ్రాహ్మణ నానుడి ప్రకారం రెడ్లు,వెలమల, అత్యాచార కాండ కొనసాగించింది బీసీ స్త్రీలపైనే అనేది నిర్విదాంశం.

ఇప్పటి వరకు దేశంలో, ఇటు రాష్ట్రంలో బీసిలను కేవలం వోటు బ్యాంక్‌ ‌రాజకీయాలుగా చూసిన రాజకీయ పార్టీలకు నేడు బీసిల వోట్లు తప్పని సరి అయ్యాయి. ఎన్నో ఏళ్ళ నుండి దేశంలో అతిపెద్ద  సామాజిక వర్గంగా ఉంటూ, దేశ సంపదను సృష్ఠించడంలోను, దేశం ఐక్యతను కాపాడటంలో గాని ముందు వరసలో ఉండి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను 75ఏళ్ళుగా తమ భుజలపై మోస్తూన్న బీసిల గురించి, వీరి అభివృద్ది, సంక్షేమం, రాజ్యాధికారం గురించి గాని ఏ ఒక్క రాజకీయ పార్టీలు ఆలోచించలేదు.ఇలాంటి తరుణంలో బహుజన్‌ ‌సమాజ్‌ ‌వాది పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) ‌రిజర్వేషన్ల పెంచడం వల్ల వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతుందని, 52% ఉన్న బీసిలకు 27% రిజర్వేశన్లు ఇవ్వడం బీసి కులాలను మోసం చేయడమే అవుతుందని, బీసిలకు కూడా 50% రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ ‌చేశారు.

అంతేకాకుండా 1932 సంవత్సరం నుండి నేటి వరకు బిసిల లెక్కలు ఎందుకు తీయలేదో సమాధానం చెప్పాలన్నారు.  తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయాలేని గొప్ప సహసంతో మరో అడుగు ముందుకు వేసి రాబోయే ఎన్నికల్లో బీసిలకు 70% అసెంబ్లి సీట్లను ఇస్తామని బహిరంగ ప్రకటన చేయడం రాజకీయ వర్గాలలో మరియు బీసి కులాల్లో గొప్ప చర్చలకు తెర లేపారు. ఇటివల కాలంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అత్యధిక జనాభా కలిగిన బీసిలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా టిక్కెట్టు ఇవ్వకుండా, బీసిలను  కేవలం వోటు బ్యాంక్‌ ‌రాజకీయాలుగానే చూశారు. కాని బహుజన్‌ ‌సమాజ్‌ ‌వాది పార్టీ మాత్రం బీసి కులానికి పెద్ద పీట వేసింది.

కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చేవిధంగా కుల చేయాలని, బీసిలకు క్రిమిలేయర్‌ ‌విధానాన్ని తోలగించాలని పేర్కొనడం జరిగింది. కుల వృత్తులకు జరుగున్న అన్యాయాలపై, మరియు బిసి కులాలో సమాజం కోసం పోరాటం చేసిన సర్వాయి పాపన్న గౌడ్‌, ‌పండుగల్ల సాయన్న, చాకలి ఐలమ్మ, ఒడ్డే ఓబన్న మొదలైన మహనీయులను  వెలుగులోకి తీసుకువచ్చి సమాజానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా బీసి గురుకుల పాఠశాలలో జరుగుతున్న నిర్లక్ష్యంపై, విద్యార్థులకు కల్పించాల్సిన కనీస వసతులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాడు. నేడు బీసిల ఆలోచన ధోరణిలో కూడా మార్పు వచ్చింది. తమకు జరుగుతున్న అన్యాయాలను గుర్తిస్తున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ఏ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారో అర్ధం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి తమ హక్కుల గురించి, రాజ్యాధికారం గురించి, అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే పార్టీలనే గెలిపించేందుకు మొగ్గు చూపు తున్నారు.
– వై.శివ ముదిరాజ్‌.
ఆల్‌ ఇం‌డియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్‌..‌తెలంగాణ ప్రెసిడెంట్‌,‌యూనివర్శిటీ ఆఫ్‌ ‌హైద్రాబాద్‌  ‌సీనియర్‌ ‌రీసార్చ్ ‌స్కాలర్‌, 9963240519

Leave a Reply