Take a fresh look at your lifestyle.

మాలలకు సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : మాలలకు సముచిత పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలకు యావత్ తెలంగాణ రాష్ట్ర మాలలు ఋణపడి ఉంటారని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందులో మాలలు, మాదిగలకు సరైన పదవులు ఇచ్చినందుకు ఆపార్టి జాతీయ అధ్యక్షులు కర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియచేశారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో శ్రీకృష్ణ పాల్గొన్నారు. తొలుత మాల మహనాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి.రావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన విధంగా సబ్ ప్లాన్ నిధులను ఇతర ప్రభుత్వ పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు, నగరాల సుందరీకరణకు మల్లించి మమ్మల్ని తిరగి మోసం చేస్తే ఓట్ల ద్వార తగిన గుణపాఠం చెబుతామని శ్రీకృష్ణ హెచ్చరించారు. అలా
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీల వర్గీకరణ చేయాలని పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడి, నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం అత్యంత శోచనీయం అన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమైన వర్గీకరణ సమస్యపై ఆయన తటస్థంగా ఉండాలని, తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీ కృష్ణను మంత్రి పదవి ఇవ్వాలని కేంద్ర నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్ల మెంట్ అధ్యక్షుడు సంకి ప్రసాద్, నూతనంగా ఎన్నికైన జుబ్లీహిల్స్ అధ్యక్షుడు ఎనమాల సుధాకర్, కె.మధు, జి.ఫాషా, ఎస్.సాయికృష్ణ, ఎమ్.మౌలాలి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply