Take a fresh look at your lifestyle.

ఆకలితో ఎవ్వరు అలమటించొద్దు

ప్రజలు సహకారంతోనే కొరోనా కట్టడి : బాల్క ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

మందమర్రి మే 4, ప్రజాతంత్ర విలేఖరి : రాష్ట్రంలో కోవిడ్‌ 19 ‌కరోనా లాక్‌డౌన్‌ ‌కాలంలో ప్రజలు ఎవ్వరు ఆకలితో అలమటించ వద్దని తెలంగాణ ప్రభుత్వం అందరిని ఆటుకుంటామని ప్రజల సహకారంతోనే కరోనా వైరస్‌ ‌కట్టడి అవుతుందని చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ‌బాల్క సుమన్‌ ‌పేర్కోన్నారు. సోమవారం స్థానిక సిఆర్‌క్లబ్‌లో బాల్క ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 200 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకు ను పెద్దపల్లి పార్లమెంట్‌ ‌సభ్యులు బోర్లకుంట వెంకటేష్‌ ‌నేతతో కలిసి పంపిణీ చేశారు. ఈ కర్యాక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాల్క సుమన్‌ ‌మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలని వైరస్‌ ‌కట్టడికి వైద్య, పారిశుద్ధ్య, పోలీస్‌ ‌శాఖ అదికారులు నిరంతరం కృషి చేశారని అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 83 లక్షల మందికి ముఖ్యమంత్రి 1500 రూపాయాల తో పాటు 12 కిలోల బియ్యం పంపిణీ చేశారని, అం దులో భాగంగానే మందమర్రి మండలంలో 23 వేల మంది లబ్ధిదారులు ప్రభుత్వ చేయూతను అందిస్తుందని తెలిపారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో కుల, మత రాజకీయా లకు అతీతంగా ప్రతి ఒక్కరు తమవంతు సహాయం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చా రు. ఎంపీ వెంకటేష్‌ ‌నేత మాట్లాడుతే కరోనా వైరస్‌ ‌కట్టడికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన తెలిపారు.

వైరస్‌ ‌రాకుండా ఉండాలంటే జాగ్రత్త పాటించాలని అన్నారు. నియోజకవర్గంలో సింగరేణి యాజమాన్యం ప్రజా సంఘాలు స్వచ్చంధ సంస్థలు కుల సంఘాలు, వ్యాసారస్తులు, సంపన్న వర్గాల వారు ముందుకు వచ్చి నిరుపేదలకు అండగా నిలవడం అభినందనీయమని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రతి క్షణం ప్రజల పక్షాన ఉంటూ ప్రతి విషయాన్ని కరోనా వైరస్‌పై ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైందని ఆయన అభినందించారు. అనంతరం మందమర్రి ఏరియా జీఎం రమేష్‌ ఆధ్వర్యంలో సింగరేణి అధికారుల సంఘం సహకారంతో సుమారు 100 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ‌నల్లాల భాగ్యలక్ష్మీ, ఓదెలు, టిబిజికెఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, జిల్లా గ్రాంథాలయ చైర్మన్‌ ‌రేణిగుంట్ల ప్రవీణ్‌, ‌జెడ్పీటిసి వేల్పుల రవి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎడ్ల మహేష్‌, ‌తాహసీల్దార్‌ ‌మోహన్‌రావు, కమీషనర్‌ ‌రాజు, టిబిజికెఎస్‌ ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!