Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే మాధవరం

ప్రజాతంత్ర, సెప్టెంబర్ 06 :తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ ఖర్చులకు ఆర్థిక చేయూత అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో 55 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు 16 వేల మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు అందించామని తెలిపారు. ఈపథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డ పెళ్లయినప్పుడు వారి తల్లిదండ్రులకు  అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబడుతున్నారని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఒకపక్క సంక్షేమంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి అనేక అంతర్జాతీయ పెట్టుబడులతో హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన మంత్రి కేటీఆర్ నేడు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మార్గదర్శిగా మారారని అన్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యున్నత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.

Leave a Reply