Take a fresh look at your lifestyle.

వేడుకలెన్నో పోతున్నా ఉద్యోగులకు మిగిలింది నిరాశే

ఓ రాష్ట్ర అవతరణ వేడుక రోజున ఉద్యోగులకు శుభవార్త వినిపిస్తానని చెప్పిన కేసిఆర్‌ ‌మాటంటుంచితే ఎన్నో వేడుకలు పోతున్నా నేటికి ఉద్యోగులకు తీపికబురు రాలేదని ఇంకా వేతనాల్లో సగం కోత పెడుతూ ఉద్యోగార్థులను ఇబ్బందులను గురిచేయడం న్యాయం కాదని పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉద్యోగ, ఉపాద్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక అధ్వర్యంలో స్థానిక అర్డివో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ వేతనం పొందడం ఉద్యోగుల హక్కు అని అలాంటి ఉద్యోగులకు గత మూడు నెలల నుంచి సగం వేతనం చెల్లించడం అన్యాయమన్నారు. ప్రతి దానికి పక్కరాష్ట్రాన్ని పోల్చుకొనే తెలంగాణ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు పూర్తి వేతనం అందిస్తున్నా ఇక్కడెందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు అందులోను బిహార్‌, ‌చత్తిస్‌ఘడ్‌ ‌వంటి రాష్ట్రాలు కూడా అక్కడి ఉద్యోగులకు పూర్తి వేతనాన్ని అందిస్తున్నాయన్నారు. గత కొన్నేండ్లుగా ఉద్యోగులు పిఆర్‌సిపై గంపెడాశతో ఉన్నారని ఎండ్లు గడుస్తున్నా నేటికి దాని ఉసే లేదని చివరకు మద్యంతర బృతిని కూడా కల్పించలేని పరిస్థితికి దనిక రాష్ట్రం తెలంగాణ చేరిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిని ఉద్యోగుల కోసం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేసిందేమి లేదని కేవలం మాటలతోనే కాలం వెల్లదిస్తోం దన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 15 వేల మంది విధ్యావాలంటరీలు పనిచేస్తున్నారని ఈ ప్రకారంగా 15 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా భర్తి చేయడంలేదన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఓక్క డియస్పిని ప్రకటించని ప్రభుత్వం నేటికి టిచర్‌ ఎలిజిబులిటి టెస్ట్‌ను నిర్వహించ పోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టెట్‌ ‌రాసి అర్హత పొందిన ఎందరికో ఉన్న ఎడేండ్ల అర్హతను కోల్పోయారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ ‌నేపద్యంలో వలస కార్మికులందరికి పరీక్షలను నిర్వహించాల్సిన ప్రభుత్వం ఆదిశగా పోకుండా కేవలం హోంక్వారంటైన్‌కే పరిమితం చేసిందన్నారు.ఆ ందులోను లక్షణాలు ఉన్నవారికే పరీక్షలంటూ మొదట చెప్పినా ఇప్పుడు 28రోజులంటూ వైరస్‌ ‌విస్తరణకు దొహదపడుతోందన్నారు. కరోనా లాక్‌డౌన్‌ ‌పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు ఉపాది కల్పించాల్సిన భాద్యత ఉందన్నారు. కాని కేంద్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని ఐదు వందల చొప్పున వేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కొందరికే 15 వందల సౌకర్యాన్ని కల్పించిందన్నారు. అలాకాకుండా రాబోయే ఆరునెలలపాటు నిరుపేద వర్గాలైన దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల అర్థిక పరిస్థితి కుదుటపడేవరకు ప్రతి కుటుంబానికి 15 వందల ప్రత్యేక అర్థిక సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికి పూర్తిస్థాయి వేతనాన్ని చెల్లించాలని గత ఎప్రిల్‌, ‌మే నెలలకు చెందిన నిలిపివేసిన వేతనాన్ని పూర్తిగా చెల్లించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాని డిమాండ్‌ ‌చేశారు. ఈకార్యక్రమములో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అద్యక్షులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ‌టిపిసిసి రాష్ట్ర ఆర్గనైజింగ్‌ ‌సెక్రెటరి బండశం కర్‌తోపాటు ఐక్య ఉపాద్యాయ వేదిక నాయకులు సూద రాజేందర్‌, ‌బైరంహరికిరణ్‌, ‌మానుపాటి బన్న, శ్రీనివాస్‌గౌడ్‌, ‌బోగ రమేష్‌, ‌రాంరెడ్డి, రామస్వామి, శంకర బాబు, సురేష్‌, ‌నరేందర్‌, ‌ప్రభాకర్‌ ‌తోపాటు పలువురు ఉన్నారు.

Leave a Reply