Take a fresh look at your lifestyle.

పారిశుద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టండి: కలెక్టర్‌ ‌శివలింగయ్య

DHSO Sooranarayana, Zonal Special Officer Sharma, RDO Komuraiya, District Welfare Officer, District Marketing Officer Surekha, MPDo Dansingh, Local Sarpanch

పారిశ్యుధ్యం పై ప్రత్యక దృష్టి పెట్టి జాతర సమయానికల్ల పనులు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్‌ ‌శివలింగయ్య అధికారులను ఆదేశిం చారు మండలంలో ఘన వ్యర్థాల నిర్వహణ పక్కాగా జరగాలని గురువారం కురవి మం డల కేంద్రంలో ఆకస్మికంగా సందర్శించి పలు వీధులలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీ లించి సక్రమంగా లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో వీధులలో చెత్త పడి ఉండడం, మురికి కాలువ లలో చెత్త తీయకపోవడం, ఇంటింటి నుండి తడి పొడి చెత్త సేకరణ లేకపోవడం గమనిం చిన కలెక్టర్‌ ఎం‌పీడీవో, సర్పంచ్‌ ‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వాన్ని వీడి అంకితభా వంతో పారిశుద్ధ్య పనులు చేపట్టి, ప్లాస్టిక్కును పూర్తిగా నియంత్రించి మోడల్‌ ‌విలేజ్‌ ‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు.ఈ సందర్భంగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో అధికారులు, సర్పంచ్‌ ‌సమావేశమై కురవి ఆలయం పరిసరాలతో పాటు పట్టణంలో పటిష్టంగా పారిశుద్ధ్యం నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. ప్రతి ఇంటికి 2 డబ్బాలు అందించి తడి, పొడి చెత్త సేకరణ వేర్వేరుగా జరగాలని, చెత్తను సేకరించుటకు గ్రామపంచాయతీ లో గల ఆరు రిక్షాలను వెంటనే రిపేరు చేయించి తడి పొడి చెత్త సేకరణ జరగాలని, సేకరిం చిన చెత్తను డంపింగ్‌ ‌యార్డ్ ‌లో వేయాలని ఆదేశించారు. గ్రామంలో గల 38 పారిశుద్ధ్య కార్మికులను వినియోగించుకొని పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని ఆదేశించా రు. తడి పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్‌ ‌వాడడం వల్ల జరిగే అనర్ధాల గురించి గ్రామస్తుల లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా, టామ్‌ ‌టామ్‌ ‌ద్వారా ప్రచారం చేయించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని, రోడ్డుపై చెత్త వేస్తే, ప్లాస్టిక్‌ ‌ను ఉపయోగిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. వెంటనే గ్రామంలోని రెండు ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ ‌సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. చెత్త వేయడానికి చెత్త కుండీలను ఏర్పాటు చేయాలన్నారు.గ్రామ పంచాయతీకి నర్సరీ ఏర్పాటుకు ఇంకనూ, స్థలాన్ని గుర్తించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే 10 ఎకరాల భూమిని కొను గోలు చేయాలన్నారు.

వచ్చే నెలలో జాతర నిర్వ హించనున్న దృష్ట్యా ఏర్పాట్లు పటిష్టంగా చేయడంతోపాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం తో పాటు పల్లె ప్రగతిలో చేపట్టిన నర్సరీలు, వైకుంఠ దామాలు, కంపోస్టు యార్డు ఏర్పాట య్యేలా, పారిశుద్ధ్యం సక్రమంగా జరిగేలా ఆర్‌ ‌డి ఓ, మండల ప్రత్యేక అధికారి శర్మ, సర్పం చు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్‌ ‌శ్రీ కురవి వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.అనంతరం మండలంలోని తిరుమలపురంలో రైతు నిమ్మ పంట క్షేత్రాన్ని సందర్శించి, వివిధ రకాల నిమ్మ పండిస్తున్న తీరును తెలుసుకున్నారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎకరాకు లక్షన్నర రూపాయల ఆదాయం పొందుతున్నారని, మార్కెటింగ్‌ ‌పద్ధతులను పాటించి దళారుల ప్రమేయం లేకుండా పండించిన పంటను విక్రయిస్తే అధిక లాభం పొందవచ్చన్నారు.అనంతరం కురవి మండలంలోని, జెడ్‌ ‌పి ఎస్‌ ఎస్‌ ‌పాఠశాలలో ఆవరణలో కిచెన్‌ ‌గార్డెన్‌ ‌భాగంగా పలురకాల కూరగాయల విత్తనాలను కలెక్టర్‌ ‌విద్యార్థులచే వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో ఇంట్లో కూడా ఖాళీ ప్రదేశంలో కూరగాయల పెంపు చేసుకోవాలనే ఆలోచన కలుగుతుందన్నారు. మార్కెట్లో దొరికే రసాయన కూరగాయలకు బదులుగా ఎలాంటి మందులు ఉపయోగిం చకుండా స్వచ్ఛమైన కూరగాయలు వినియో గించుకోవచ్చు అన్నారు. పాఠశాల ఆవరణలో విశాలమైన ఖాళి స్థలం ఎక్కువగా ఉన్నందున మామిడి, ఇతర పండ్ల మొక్కలను కూడా పెంచాలని ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో డి హెచ్‌ ఎస్‌ ఓ ‌సూర్యనారాయణ,మండల ప్రత్యేక అధికారి శర్మ, ఆర్డిఓ కొమురయ్య, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి సురేఖ, ఎంపీడీవో ధన్సింగ్‌, ‌స్థానిక సర్పంచ్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Tags:  ZPHS School,DHSO Sooranarayana, Zonal Special Officer Sharma, RDO Komuraiya, District Welfare Officer, District Marketing Officer Surekha, MPDo Dansingh, Local Sarpanch

Leave a Reply