Take a fresh look at your lifestyle.

పాపాల ప్రాయశ్చిత్తం కోసమే పూజలు..! కేసీఆర్ పై పొన్నాల విమర్శలు

నదీ జలాలు సముద్రం పాలు అయ్యాయని..రాష్ట్రఖజానా కల్వకుంట్ల పాలు అయిందని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల ముఖ్య మంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందని..కాళేశ్వరం ఒక ఐరావతం..ప్రచారస్త్రం లాగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.105 రోజుల్లో మూడు బ్యారేజీ ల నుంచి మిడ్ మానేరు కు ఒక్క చుక్క నీరు తీసుక రాలేదని ..రోజుకు మరో టి ఎం సీ నీరు కు 4,400కోట్లు దుబారా కాదా అని ఆయన ప్రశ్నించారు.

ప్రజల్ని మభ్య పెడుతున్నారు అంటూ..నవంబర్ లో మెడిగడ్డ దగ్గర మీరు చెప్పిన లెక్క ప్రకారం నీళ్లు లేనే లేవు..నేను చెప్పేది అబద్ధం అని చెప్తారా…నేను ఆధారాలతో చూపిస్తా ఇది నిరార్థక ఆస్తి కాదా..దోపిడీని బయటకు రాకుండా పూజలతో మభ్యపెడుతున్నారని పొన్నాల ఆరోపించారు.పూజలు చేసుకుంటే తప్పేం కాదు…దోపిడీ చేస్తేనే తప్పు అని ఆయన అన్నరు.జల యజ్ఞం పేరుతో కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్ట్ లు నిర్మాణ చేస్తే అవాకులు చవాకులు పేలారు..నల్గొండ టన్నెల్ పనులను ఎందుకు పరిశీలించరు..నిర్మాణ పనులు చేయాల్సి ఉన్న ఎందుకు వెల్లట్లేదు..పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దగ్గరకి ఎందుకు వెళ్ళట్లేదు.. కంతనపల్లి ప్రాజెక్టు ను వెంటనే పూర్తి చేయాలి అని డిమాండు చేసారు.

Leave a Reply