Take a fresh look at your lifestyle.

నిండు కుండలా తాలిపేరు ప్రాజెక్టు

భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని చిన్న మిడిసిలేరు పంచాయతీలో గల తాలి పేరు మధ్యతరహా ప్రాజెక్ట్ ‌నిండుకుండల తలపిస్తుంది. ఎగువ ప్రాంతాలైన ఛత్తిస్‌ఘఢ్‌, ఒరిస్సా ,మహారాష్ట్ర అటవి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరద ఉదృతి వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.90 మీ ఉంచి ప్రాజెక్టు 25 గేట్లు ఉండగా 24 గేట్లు పూర్తిస్థాయిలో పైకి ఎత్తి 1, 02,399 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరుగుతుంది. ఈ వరద ఉదృతి దిగువన ఉన్న గోదావరి నదిలో చేరడంతో గోదావరి నీటిమట్టం పెరగడం జరుగుతుంది. వర్షాలు కురిసిన మొదటి లోనే ప్రాజెక్టు నిండటంతో ఆయకట్టు క్రింద ఉన్న రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. రైతులు వరి నారులు పోయడంతో అవి నాటు వేటకు సిద్ధంగా ఉన్నాయి ప్రాజెక్టు నిండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.గురువారం సాయ్ర 87,933 క్యూసెక్కుల నీటిని దిగువ భాగానికి విడుదల చేసారు. మరోవైపు నిండుకుండలా తలపిస్తున్న ప్రాజెక్టు అందాలను చూడటానికి పర్యాటకులు వస్తూ ఉండడంతో ప్రాజెక్టు ప్రాంతం జన సందడితో నిండి, ప్రాజెక్టు అందాలను తిలకించటానికి వస్తున్న పర్యాటకులతో సందడిగా ఉన్నది.

Leave a Reply