Take a fresh look at your lifestyle.

వర్షపునీటితో రామాలయం ప్రాంతం , పలు కాలనీలు మునక

భారీ వర్షాల కారణంగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం చుట్టూ వర్షపు నీరు చేరుకుంది. రామాలయం వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ ‌ప్రాంతానికి భారీగా నీరు చేరుకుంది. అక్కడే నిత్యాన్నదాన సత్రం వద్ద కూడ వర్షపు నీరు చేరింది. ఈ వర్షపు నీటిని గోదావరి లోకి పంపించేందుకు అధికారులు కృషి చేసారు. మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం వలన కొద్దిసేపు భక్తులు యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. తరువాత మోటార్ల ద్వారా నీటిని గోదావరి లోకి పంపించారు. భద్రాచలం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన లోతట్టు ప్రాంతాలైన ఏఎంఈ కాలనీ , కొత్తకాలనీ ఇండ్లలోకి నీరు చేరుకుంది. ఆ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజుపేట వద్ద వర్షపునీరు నిలిచిపోవడంతో గ్రామపంచాయితీకారులు ట్రొక్లెయిన్‌ ‌ద్వారా కాలువలు తీసి నీటిని బయటకు పంపించారు.

Leave a Reply