Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టాలపై అసత్య ప్రచారాలు

రాజకీయ లబ్ది కోసం విపక్షాల దుష్ప్రచారం
బెంగాల్‌, ‌కేరళలో రైతుల ఆందోళనలు ఎందుకు లేవు
రైతుల భూములు ఎవరూ లాక్కోరు
ఆరు రాష్ట్రాల రైతులతో నేరుగా మాట్లాడిన ప్రధాని మోడీ

నూతన వ్యవసాయ చట్టాలపై కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవాలను దాచేసి, రాజకీయాలు చేసి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను బద్నాం చేసి కొందరు తమ రాజకీయ పబ్బాన్ని గడుపు కుంటున్నారని, రాజకీయాల్లో మెరిసిపోతున్నారని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకంటే ముందున్న ప్రభుత్వాల విధానాల వల్లే రైతులు నష్టపోయారని, తాము మాత్రం వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి రైతులకు నూతన బలాన్ని ఇచ్చామని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులతో ’కిసాన్‌ ‌సమ్మేళన్‌’ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి నుంచి రైతుల అకౌంట్లలోకి 18,000 కోట్ల రూపాయలను ప్రధాని జమ చేశారు.

ఎలాంటి దలారులు, కమిషన్లు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని ఆయన తెలిపారు. ప్రైవేటు కంపెనీలు వొచ్చి రైతుల భూములను లాక్కొంటాయని ప్రచారం చేస్తున్నారని, అలాంటివేవి• జరగవని, రైతుల భూములను కార్పొరేట్లు లాక్కోరని మోదీ హావి• ఇచ్చారు. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లాంటి రిమోట్‌ ‌ప్రాంతాల్లోని రైతులు కూడా దీనిని నమ్మాలని మోదీ కోరారు. ప్రైవేట్‌ ‌కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ రైతుల భూములను లాక్కోరని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు వార్తల్లో నిలవడానికి, చర్చల్లో నానడానికి ఢిల్లీలో ఈవెంట్‌ ‌పోగ్రాంలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. బెంగాల్‌ ‌పరిస్థితిపై మౌనంగా ఉన్నవారు నేడు ఢిల్లీకి వచ్చి ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలో గుడారాలు వేసుకొని ఉన్నవారికి కేరళ ఏమాత్రం కనిపించదని పరోక్షంగా వామపక్షాలపై మోదీ విరుచుకుపడ్డారు. పినరయ్‌ ‌విజయన్‌ ‌నేతృత్వంలోని కేరళలో కూడా మార్కెట్‌ ‌యార్డులు లేవని కానీ అక్కడ ఏమాత్రం ఆందోళనలు నిర్వహించరని విమర్శించారు. పీఎం ఫసల్‌ ‌బీమా యోజన, కిసాన్‌ ‌కార్డ్, ‌సమ్మాన్‌ ‌నిధి యోజన లాంటి వాటి ద్వారా వ్యవసాయాన్ని లాభతరం చేయాలని చూస్తున్నామని, రైతుల ఖర్చులు తగ్గించడానికే తాము కృషి చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply