Take a fresh look at your lifestyle.

సిఎఎను వ్యతిరేకించే క్రమంలో అశాంతికి ఆజ్యం

 

 ‌ఢిల్లీలో అల్లర్లకు ఇప్పటి వరకు 18మంది అసువులు బాయడం దారుణం కాక మరోటి కాదు. అలాగే వందలాది వాహనాలు తగులబెట్టారు. అలాగే గృహదహనాలకు పాల్పడ్డారు. ఇంతగా అల్లరి మూకలు తెగించి చేసిన అకృత్యాలకు ఢిల్లీ ప్రజలు వణికి పోతున్నారు. దీనిపై కేంద్ర మోంవౄఖ మంత్రి సక్షించి అల్లర్ల అదుపునకు ఉపక్రమించారు. అయితే ఇదంతా ఓ పద్దతి ప్రకారం సాగుతున్న వ్వయహారంగా గుర్తించాలి.  సిఎఎ నిరసనలు పరాకాష్టకు చేర్చాలన్న పన్నాగం మేరకు సాగుతున్న విధ్వంసంగా చూడాలి. అసహనం, విద్వేషం విరుచుకుపడడంతో ఈశాన్య ఢిల్లీ పండుటాకులా విలవిలలాడుతోంది. రెండు రోజులుగా సాగుతున్న ఈ దాడుల్లో మంగళవారం సాయంత్రానికి ఇరవై మంది వరకు అమాయక పౌరులు, ఓ హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌చనిపోయారు. ఇంకా అనేక మంది గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. వీరిలో సగం మందికి బుల్లెట్‌ ‌గాయాలు ఉన్నట్లు తేలింది. చివరికి జర్నలిస్టులను కూడా ఈ శక్తులు వదల్లేదు. ఈ హింసాత్మక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు. మరో వైపు లూటీలు, విధ్వంస కాండ యథేచ్ఛగా సాగిపోతోంది. చాలా వరకు ఆస్తులు లూటీలు,దహనాలకు గురయ్యాయి. మౌజ్‌పూర్‌, ‌చాంద్‌బాగ్‌, ‌ఖుర్జీఖాన్‌, ‌భాజాన్‌పురాలో వరుస దాడులతో ప్రజలు భీతిల్లిపోయారు. తలుపులు బిగించుకుని ఇళ్ళల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. స్కూళ్లు మూతపడగా, పరీక్షలను వాయిదా వేశారు

Leave a Reply