Take a fresh look at your lifestyle.

స్వైన్‌ఫ్లూ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

students learning,Swine Flu,dr.Vasantalila,gangaramజిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశానుసారం బిజినపల్లి మండలంలోని గంగారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థులకు స్వైన్‌ ‌ఫ్లూ వ్యాధిపై అవగాహన శిబిరమును వైద్యాధికారి డి.వసంతలీల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం, గిరిజన తండాలలో స్వైన్‌ ‌ఫ్లూ వ్యాధి రాకుండా ప్రతి విద్యార్థి అవగాహనతో నివారణ చర్యలు తీసుకోవాలని, పలు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ఇన్‌ ‌ఫ్లు ఎంజా టైప్‌-ఏ ‌వైరస్‌ ‌ద్వారా రోగి నుండి తుంపర్ల ద్వారా గాలిలో కలిసి ఆరోగ్యవంతులు ఈ గాలి పీలిస్తే, ఊపిరితిత్తులలోని అంతర్భా గములో పలు ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు.

స్వైన్‌ ‌ఫ్లూ వ్యాధి యొక్క వ్యాధి కారక లక్షణాలు, సోకే విధానం, నివారణ చర్యలు వివరిం చారు. అనుమానితులు, రోగ లక్షణాలు ఉన్న వ్యక్తులు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రులలో ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ముఖ్యంగా సామూహిక గ్రూపులలో, జాతరలో, జాతరలకు వెళ్లే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రథమంగా విద్యార్థులు ఆహారానికి ముందు, భోజనం చేసే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులను తరచుగా శుభ్ర పరచుకోవాలి అని సూచించారు. పౌష్టికాహారాన్ని కాలానుగుణంగా దొరికే పండ్లను అధిక మొత్తంలో నీటిని సేవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు సతీష్‌ ‌కుమార్‌, ఉపాధ్యాయులు రాజా రామ్‌ ‌ప్రకాష్‌, ‌విజయ్‌ ‌కుమార్‌, ‌కురుమయ్య, వినోద్‌ ‌కుమార్‌, ‌హెల్త్ ‌సూపర్వైజర్‌ ‌కిష్టమ్మ, ఆరోగ్య కార్యకర్తలు జి నగేష్‌, ‌కే గంగా, యాదగిరి, ఆశ కార్యకర్త రామానుజ, విద్యార్థులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

Tags: students learning,Swine Flu,dr.Vasantalila,gangaram


 

  
 			

Leave a Reply