పరీక్షా పే చర్చలో విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు
- టెక్నాలజీని విద్యార్థులు తమ ఎదుగుదలకు ఉపయోగించాలి
- ప్రధాని నరేంద్ర మోడీ. తిలకించిన జిల్లా విద్యార్థులు
న్యూఢిల్లీ తలకఠోర స్టేడియం నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లా లోని అన్ని ఉన్నతపాఠశాలల విద్యార్థులు తిలకించారు. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వారితో ముచ్చటించారు. పరీక్షా పే చర్చ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. గత వైఫల్యాల నుంచి విద్యార్థులు పాఠాలు నేర్చుకుని విజయం వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నించాలని ఆయన విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులు ముఖ్యంగా పదవ తరగతి, 12వ తరగతి విద్యార్థులు మరికొన్ని రోజుల్లో బోర్డు ఎగ్జామ్స్ రాయనుండగా వారిలో ఉన్న ఆందోళన భయాన్ని తొలగించే భాగంగా ప్రధాని ప్రతి ఏటా విద్యార్థులతో ముచ్చటించడం జరుగుతోంది. అంతేకాదు పరీక్షలంటేనే ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కొన్ని చిట్కాలను కూడా ప్రధాని మోడీ పంచుకున్నారు. దేశవ్యాప్తంగా రెండు వేల మంది విద్యార్థులతో నేరుగా ప్రధాని మోడీ ముచ్చటించారు. ప్రధానితో పరీక్షాపే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ప్రభుత్వం ఐదు టాపిక్స్‌పై నిర్వహించిన షార్ట్ ఎస్సేలో విజయం సాధించిన 1050 విద్యార్థులను సెలెక్ట్ చేయడం, ఈ మొత్తం కార్యక్రమంను ఇద్దరు విద్యార్థులు సమీక్షించడం విశేషం గతేడాది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 మిషన్ విఫలమైందని గుర్తు చేసిన ప్రధాని మోడీ ఆ ప్రయోగం చాలా క్లిష్టమైనదని విజయవంతం అవుతుందో లేదో తెలియదని అలాంటప్పుడు మిషన్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లకపోవడమే మంచిదని పలువురు సూచించినట్లు మోడీ చెప్పారు. విఫలమైతే ఏమౌతుంది అని తాను వారికి ఎదురు ప్రశ్న వేసినట్లు చెప్పి నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు వెళ్లినట్లు ప్రధాని చెప్పారు.
చంద్రయాన్-2 విఫలం చెందడంపై తాను కూడా ఎంతో బాధపడినట్లు చెప్పిన ప్రధాని ఈ మిషన్ కోసం కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తల దగ్గరకు వెళ్లి వారిని ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పినట్లు ప్రధాని మోడీ గుర్తుచేశారు. విద్యార్థులు తమ వినియోగించుకునే స్మార్ట్ ఫోన్లను ప్రతిరోజు వాటికి కొంతసేపు దూరంగా ఉంటూ ఆ సమయాన్ని నానమ్మ ,తాతయ్య లతో గడిపి వారి అనుభవాలను తెలుసుకోని వారితో గడపాలి అన్నారు. టెక్నాలజీని తమ అభివృద్ధికి వినియోగించుకోవాలని, ప్రతిరోజు 10 కొత్త పదాలను వాటి స్పెల్లింగ్ మరియు అర్థాలను తెలుసుకునేందుకు వినియోగించి అభివృద్ధిలోకి రావాలన్నారు. ప్రధాని పరీక్షలపై చర్చ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా లోని అన్ని ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. డిఇఓ గోవిందరాజులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులతో కలిసి తిలకించారు ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ప్రధాని పరీక్షలపై చర్చ కార్యక్రమం తమకు ఎంతో ప్రేరణ కలిగిందని పరీక్షలంటే భయం తొలగి పోయిందని ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రధానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు
Tags: PM Narendra Modi,clashes with students,exam,technology growth