Take a fresh look at your lifestyle.

‌ప్రశాంత వాతావరణంలో పురుపోరు

tranquil environment,Khammam,Arvey Karnan
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ‌కర్ణన్‌, ‌సీపీ తప్సీర్‌ ఇక్బాల్‌

ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ‌సీపీ తప్సీర్‌ ఇక్బాల్‌ ‌పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ‌లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పక్షాలు సహ•కరిస్తున్నా యని అదే విధంగా ఈ ఎన్నికలు జరిగేలా సహకరించాలన్నారు. ఈ నెల22 జరిగే ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో మూడు మున్సిపాలిలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. వాటిలో వైరా, మధిర, సత్తుపల్లి ఉన్నాయన్నారు.

వైరాలో 20 వార్డులకు గానూ ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 19 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు. మొత్తం 41 పోలింగ్‌ ‌స్టేషన్లలలో 21,978 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. వైరా నుంచి 74 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారని అన్నారు. అలాగే సత్తుపల్లిలో 23 వార్డులకు గానూ 6 వార్డులు ఏకగ్రీవం కావడంతో 17 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు. 55 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా 44 పోలింగ్‌ ‌స్టేషన్లు ఏర్పాటు చేశామని మొత్తం 18,290 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. మధిర లో 22 వార్డులకు గాను 67 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారని 44 పోలింగ్‌ ‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిలో 24,242 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ఏదైనా ఒక గుర్తింపు కార్డుతో పోలింగ్‌ ‌బూత్‌కు వచ్చి ఓటు హక్కు వినియోగించు కోవాలన్నారు. పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద భారీ బందో బస్తూ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని 25 న కౌంటింగ్‌ ‌నిర్వహిస్తామన్నారు.

Tags: tranquil environment,Khammam,Arvey Karnan

- Advertisement -


 

 

  
 

Leave a Reply