Take a fresh look at your lifestyle.

అయోమయంగా పాలన

  • మంత్రులను కలవని సీఎం
  • అధికారులు ఎక్కడ ఉంటారో అడ్రస్ ఉండదు
  • సెక్రటేరియట్ లో ఏ శాఖకు ఫోన్ చేసినా కలవదు
  • కాళేశ్వరం నుంచి ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు
  • నిరుద్యోగ భృతికి అతీగ‌తీ లేదు
  • ధరణితో రాష్ట్రం గందరగోళం సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో పాలన అంతా అయోమయంగా సాగుతోంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులను, ఇటు ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ నుంచి నయా రాచరిక పాలన చేస్తున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మల్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా కేసీఆర్ రెండేళ్ల పాలపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఎవరు ఎక్కడ ఉంటారో.. ఎవరికి తెలియని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సెక్రటేరియట్ లో ఏ శాఖకు ఫోన్ కలవని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కాళేశ్వరం నుంచి ఇప్పటివరకూ ఒక్క ఎకరాకైనా నీళ్లు పారాయా? అని భట్టి ప్రశ్నించారు.

ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీపై ఏనాడైనా కేసీఆర్ స్పందించారా? అని భట్టి మీడియా ముఖంగా అడిగారు. వరదలతో హైదరాబాద్ నగరం మునిగిపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకున్నారని భట్టి మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన భృతి హామీకి అతీగ‌తీ లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కనీసం విధివిధానాలె ఖరారు చేయలేదన్నారు. దళితులుకు మూడుకరాల భూమి ఇస్తామన్న మామీపై కనీసం ఊసేలేదని భట్టి చెప్పారు. ధరణితో తెలంగాణ రాష్ట్రం గందరగోళంలో పడిందని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు కావాల్సిన వారికోసం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను గందరగోళం చేశారని భట్టి అన్నారు.

వ్యవసాయ రంగం అతలాకుతలం అవుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. రుణమాఫీ చేయకపోవడం రైతులకు మరింత భారంగా మారిందని అన్నారు. సన్నవడ్లు పండించిన రైతుల బాధలు కేసీఆర్ కు పట్టవా? అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల ముందు ప్రకటించిన వరద సహాయం ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్నికల తరువాత ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 57 ఏళ్లకే పెన్షన్ అని చెప్పిన కేసీఆర్.. కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం.. తరువాత దానిని మర్చిపోయిందన్నారు. ఆన్ లైన్ తరగతులకు సరైన వసతులు కల్పించకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని భట్టి మండిపడ్డారు.

కొరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చే అంశం పరిశీలిస్తామన్నారు..ఏంతవరకు పరిశీలను వచ్చిందో ఏవరికీ తెలియదన్నారు. రాష్ట్ర కేబినెట్ లో మంత్రులకు అధికారాలు లేవు..కేటీఆర్, హారీష్ మినహా అంతా డమ్మీ లే అని భట్టి హాట్ కామెంట్లు చేశారు. కేసీఆర్ పాలనలో సామాన్య ప్రజలను, రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని, సూటు బూటు వేసుకున్నవారినే కేసీఆర్ కలుస్తారని ఘాటుగా విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల ఆలోచనను మళ్లించేందుకే భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని భట్టి అన్నారు. భారతీయ జనతాపార్టీ భావోద్వేగాలతో ట్ల రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సీఏల్పీ నేతగా మా ఎమ్మెల్యేలు పీసీసీ ఎంపిక పై కొన్ని అభిప్రాయాలు చెప్పారు.. వారి అభిప్రాయాలను ఇంఛార్జ్ మానిక్యం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు ఈ సందర్భంగా భట్టి మీడియాకు చెప్పారు. పీసీసీ ఎంపిక పై నా అభిప్రాయం ను పార్టీ ఇంఛార్జ్ కు తెలియజేసానన్నారు. ఈ సందర్భంగానే ఢిల్లీ వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోలేదని ఆయన మీడియాకు వెల్లడించారు. ఒక వేళ వెళ్లే అవకాశం ఉంటే తప్పకుండా మీడియాకు తెలియజేస్తానని చెప్పారు.

Leave a Reply