Take a fresh look at your lifestyle.

భద్రగిరికి ముక్కోటి శోభ

  • నేటి నుండి రామాలయంలో అధ్యయనోత్సవాలు – దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్న రామయ్య 24న తెప్పోత్సవం, 25న ఉత్తర ద్వారదర్శనం

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీసీతిరామ చంద్రస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. కొరోనా నియమనిబంధనలతో ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదయ శాఖ నిర్ణయం తీసుకుంది. 15వ తేది మంగళవారం నుండి 24వ తేది వరకు శ్రీస్వామివారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతీ రోజు నిర్వహించే వివిధ అవతారాలలో చిత్రకూట మండపంలోనే నిర్వహించనున్నారు.

15వ తేది మంగళవారం మత్స్యావతారం, 16వ తేది బుధవారం కూర్మావతారం, 17వ తేది గురువారం వరాహవతారం, 18వ తేది శుక్రవారం నృసింహవతారం, 19వ తేది శనివారం వామనావతారం, 20వ తేది ఆదివారం పరశురామరావతారం, 21వ తేది సోమవారం శ్రీరామరావతారం, 22 వతేది మంగళవారం బలరామవతారం, 23వ తేది బుధవారం శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమివ్వన్నారు. 24వ తేదీన తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 25వ తేది తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. స్వామివారి దర్శనం కేవలం 200 మంది వివిఐపిల భక్తులకే అనుమతి ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 25 ‌నుండి జనవరి 4 వరకు రాపత్తు సేవలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు పది రోజుల పాటు నిర్వహించనున్నారు.

కొరోనా నిబంధనల ప్రకారం ఉత్సవాల నిర్వహణ:

bhadrachalam temple

కొరోనా విజృంభణ కొనసాగుతున్నందున కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారమే ముక్కోటి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 24వ తేదిన జరిగే తెప్పోత్సవాన్ని చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న యాగశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నీటిదోనె లో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. అంతేకాకుండా రాపత్తు సేవలు కూడ ఈసారి కోవిడ్‌ ‌కారణంగా చిత్రకూట మండపంలోనే నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలను ఆలయం ముస్తాభైంది.రంగురంగుల విద్యుత్‌ ‌దీపాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అనుబంధ ఆలయాలు కూడ విద్యుత్‌ ‌దీపాలతో అలంకరించారు. ప్రధాన కూడళ్ళ వద్ద స్వాగల ద్వారాలను కూడ ఏర్పాటు చేసారు.

Leave a Reply