Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌టెస్ట్‌ల సంఖ్య పెంచాలి

  • కోవిడ్‌ ‌గురించి ప్రజలు ఆందోళన చెందవద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • స్వీయ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి భౌతిక దూరం తప్పక పాటించాలి
  • టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో కోవిడ్‌ ‌టెస్ట్‌ల సంఖ్యను మరింతగా పెంచాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సోమవారం రాత్రి కోవిడ్‌ ‌వైరస్‌ ‌వ్యాప్తి కట్టడికి అమలుచేయాల్సిన వ్యూహం,ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంపై హైదరాబాద్‌ ‌నుండి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…కోవిడ్‌ ‌గురించి ప్రజలు ఆందోళన చెందవద్దనీ,  ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  స్వీయ రక్షణ కు ప్రాధాన్యం ఇవ్వాలనీ,  భౌతిక దూరం తప్పక పాటించాలనీ,  జనసమ్మర్ధక ప్రదేశాలకు దూరంగా ఉండాలనీ, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు.  బయటకు వెళ్లే సందర్భంలో ప్రతి ఒక్కరూ తప్పక మాస్క్ ‌ధరించాలన్నారు.  మాస్క్ ‌లేకుండా బయటికి వస్తే రూ.500 ఫైన్‌ ‌వేయాలన్నారు.  వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు
చేయించుకోవాలనీ,  శానిటేషన్‌, ‌స్ప్రే కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చూడాలన్నారు.

బైక్‌పై ఒక్కరూ, ఆటో లో ఇద్దరికీ మించి ప్రయాణం చేయొద్దన్నారు. పోలీస్‌లు విస్తృతంగా పెట్రోలింగ్‌ ‌చేయాలనీ,  కోవిడ్‌పై ప్రసార మాధ్యమాలు, హోర్డింగుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రతి వార్డుల్లో క్షేత్రస్థాయిలో ఇంటింటా తిరిగి కొరోనా వ్యాధి వ్యాప్తి జరగకుండా, నివారణ, కట్టడికై చర్యలు చేపట్టాలి. ఇందులో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.  ప్రధాన జంక్షన్లలో, వీధుల్లో ప్రజలు గుమిగూడ కుండా వాహనాలపై ఒక్కరే వెళ్లాలనీ,  వైన్‌ ‌షాపులు, బార్లు రెస్టారెంట్లు, షాపింగ్‌ ‌మాల్స్ ‌వద్ద జనం గుమిగూడకుండా చర్యలు చేపట్టాలన్నారు.  వార్డు వారీగా వార్డు లెవల్‌ ‌కమిటీ ప్రజాప్రయోజనార్థం ప్రజల ఆరోగ్య పరిరక్షణకై కొరోనా కట్టడికై చేపట్టాల్సిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించి నివారణకు కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో  జిల్లా కలెక్టర్‌ ‌పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవీస్‌, ‌జిల్లా అదనపు కలెక్టర్‌ ‌ముజమ్మీల్‌ ‌ఖాన్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, ఏసీపీ, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!