Take a fresh look at your lifestyle.

24 ‌గంటల్లో కొరోనా కేసులు… రాష్ట్రంలో 2478.. దేశంలో 83,341 ఆగని వైరస్‌ ‌విజృంభణ

దేశంలో కొరోనా మహమ్మారి పంజా విసురుతున్నది. దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా రెండోరోజూ 80 వేలకుపైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసులు 39 లక్షలు దాటాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 83,341 మందికి కొరోనా వైరస్‌ ‌సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39,36,748కు చేరింది. ఇందులో 8,31,124 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 30,37,152 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. కొరోనా బారినపడిన వారిలో మరో 1096 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు కొరోనా మృతుల సంఖ్య 68,472కు చేరింది. దేశంలో కొరోనాతో ఇంతపెద్ద సంఖ్యలో మరణించడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా నిన్న 11,69,765 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది. దీంతో సెప్టెంబర్‌ 3 ‌వరకు మొత్తం 4,66,79,145 నమూనాలను పరీక్షించామని తెలిపింది. మొత్తంగా భారత్‌లో వైరస్‌ ‌ప్రభావం తగ్గుముఖం పట్టడం లేదు. తొలుత ప్రభావం తీవ్రంగా ఉన్న స్పెయిన్‌, అమెరికా, బ్రెజిల్‌లో కొరోనా ప్రభావం రానురాను తగ్గిపోతుండగా భారత్‌లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

రాష్ట్రంలో కొత్తగా 2,478 పాజిటివ్‌ ‌కేసులు
తెలంగాణలో కూడా వైరస్‌ ‌విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,478 పాజిటివ్‌ ‌కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. వైరస్‌ ‌బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 866కు చేరింది. గురువారం ఒక్కరోజే 2,011 మంది కోవిడ్‌ ‌రోగులు కోలుకుని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,02,024. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 32,994. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ ‌బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కొరోనా బాధితుల రికవరీ రేటు 77.14 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 75.0 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.74 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.63 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 62,543 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 16,05,521కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply