- నకిలీ శానిటైజర్లు, అధిక ధరలకు అమ్మితే చర్యలు
- జిల్లాలో అన్నీ చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు
కరోనా వైరస్‌పై వైద్యులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డిఓలు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపిఓలు, డిఎస్పిలతో కరోనా వైరస్‌పై వీడియో కాన్ఫరెన్స్ జిల్లా ఎస్పి ఆర్.భాస్కరన్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లాలో కరోనా వైరస్ సోకకుండా అన్నీ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ వల్ల ఎ ఒక్క పాజిటివ్ కేసు కూడా జిల్లాలో నమోదు కాకూడదని అధికారులు, వైద్య బృందాలు ఆ దిశగా పని చేయాలని సూచిం చారు. జిల్లా సరిహద్దుల్లో అన్నీ చెక్‌పోస్టుల నుండి వచ్చే, వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే పరిసరాల పరిశుభ్రతపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఒకే చోట అధిక మొత్తంలో ఉండరాదని, పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద, అన్నీ కార్యాలయాల వద్ద శానిటైజర్లు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫంక్షన్హాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఫంక్షన్లు చేయకూడదని, అలాగే మత పరమైన కార్యక్ర మాలు, ఊరేగింపులు ఈ నెల 31వరకు చేపట్టరాదని సూచించారు.
ఇతర రాష్ట్రాల నుండి, దేశాల నుండి మార్చి 1 తరువాత వచ్చిన వారిపై వివరాలు సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య అధికారులకు వెల్లడించారు. ప్రతి మండలం నుండి మండల స్థాయి అధికారులు ఒక గ్రూప్‌గా ఏర్పాటు అయి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి నివేదిక పంపాలన్నారు. ఇప్పటికే జిల్లాలో కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితిలోనే బయటికి అన్నీ భద్రతతో వెళ్లాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ మార్గ దర్శకాలను పటిష్టంగా అమలు చేయడం జరిగిందని, ఎవరైనా అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు కరోనా వైరస్‌పై భయాందోళన చేందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ను నివారించ వచ్చునని తెలిపారు. జిల్లాలో నియమించిన అంగన్ వాడీ వైద్య బృందాలు ప్రజలకు అవగాహన కల్పిస్తు విధులను పటిష్టంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పట్టణ, గ్రామాలలో పారిశుద్ద్య కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎక్కువ మొత్తంలో మాస్క్‌లు అందుబాటులో ఉంచాలని వైద్యులను ఆదేశిస్తు మందుల దుకాణాల్లో మాస్క్‌లను అధిక ధరలకు విక్రయిస్తు చర్యలు తప్పవని హెచ్చరిం చారు. వైరస్ అనుమానితులను 108వాహనాలలో మాత్రమే ఉపయోగించాలని సూచించారు. నకిలీ శానిటైజర్లు అమ్ముతున్న వ్యక్తులపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చిన వారిని పరిక్షించి హౌస్ ఐసోలేషన్ చేసే విధంగా అన్నీచర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పి ఆర్.భాస్కరన్ మాట్లాడుతు జిల్లాలో ఇప్పటికే గట్టి నిఘా ఉంచామని, ప్రజలను ఇబ్బందిపెట్టె వారిపై కఠినంగా వ్యవహరిస్తు, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తే నివారణ ఒకటే మార్గమన్నారు. అన్నీ మండలాలలోని పోలీలను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్షరెన్స్‌లో అధికారులు విజయలక్ష్మి, మోహన్‌రావు, కిషోర్‌కుమార్, డాక్టర్ నిరంజన్, యాదయ్య, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, పంచాయతీ రాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.