Take a fresh look at your lifestyle.

నిరాడంబరంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సూర్యాపేట, జూన్‌ 2, ‌ప్రజాతంత్ర ప్రతినిధి):దామరచర్ల వద్ద నిర్మిస్తున్న థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌తోపాటు గుడిమొల్కాపూర్‌ ‌వద్ద నిర్మాణంలో ఉన్న ఇండస్ట్రియల్‌ ‌పార్క్‌లే ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్దికి దిక్కూచిలని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌ ‌రెడ్డి అన్నారు. మంగళ వారం జిల్లా  కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు అభివృద్దిని పరుగులు పెట్టించడంతోపాటు ఉపాధి అవకాశాల కల్పనకు ఈ రెండు ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన 6సంవత్సరాల్లోనే నల్గొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరిన్‌ ‌భూతాన్ని మటుమాయం చేశామన్నారు. అందుకు ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ ‌భగీరథ పథకమేనని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న 24కరెంట్‌లో ఎక్కువ లాభపడింది ఉమ్మడి నల్గొండ జిల్లానే అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌, ‌జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌గుజ్జ దీపికా యుగంధర్‌, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌, ‌శానంపూడి సైదిరెడ్డి, మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ‌నిమ్మల శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి, ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్‌ ‌కార్యాలయంలో…
జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ‌కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ ‌త్రివర్ణ పతాకం ఎగురవేసి జిల్లా ప్రజానికానికి, సిబ్బందికి రాష్ట్ర ఆవిర్బావ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతు 2014 జూన్‌ 2‌న తెలంగాణ ప్రాంతం నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిందని గుర్తుచేశారు. మువ్వన్నెల జెండాను గురవేసి గౌరవ వందనం చేశారు. ఆర్‌ఎస్సై సంతోష్‌ ‌గార్డ్ ‌కమాండర్‌గా పనిచేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మోహన్‌ ‌కుమార్‌, ఎస్‌బి ఇన్స్‌ఫెక్టర్‌ ‌రాజేష్‌, ‌డిసిఆర్‌బి ఇన్స్‌ఫెక్టర్‌ ‌సుధాకర్‌, ‌గోవిందరావు, నరసింహారావు, సంతోష్‌, ‌రామారావు, డిపిఓ, ఎస్‌బి, డిసిఆర్‌బి సిబ్బంది తదితరులు ఉన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో…
దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి 6సంవత్సరాలు కావొస్తున్నా ఇంతవరకు ఆ మాటే ఎత్తడం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి ఏడుకొండలు గుర్తుచేశారు. మంగళవారం  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. నాటి తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ నాయకులు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ ‌జైట్లీలు పార్లమెంట్‌లో నాటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొనిరావడం వల్లనే సాధ్యమైందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాకా దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని, ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికారని మండిపడ్డారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి అభిద్‌, ‌నల్లకుంట్ల అయోధ్య, మన్మథ రెడ్డి, చల్లమల్ల నరిసింహ, కౌన్సిలర్లు కట్కూరి కార్టీక్‌ ‌రెడ్డి, వీరేంద్ర, మహాలక్ష్మి, గన్నారెడ్డి, మమతా రెడ్డి, కక్కిరేణి ఆనంద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో మంత్రి పువ్వాడ 
image.png

ఖమ్మం సిటి, జూన్‌ 2 (‌ప్రజాతంత్ర విలేకరి) : రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో మంగ ళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌జాతీయ జెండాను ఎగురవేసి జాతికి వందనం చేసారు. అంతకుముందు కలెక్టర్‌లోని జాతిపిత, అంబేద్కర్‌ ‌విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాల పోరాటం, అమరవీరుల బలిదా నాలు, కెసిఆర్‌ ‌మడమతిప్పని పోరాట ఫలితమే కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను నెరవేర్చిందన్నారు. దేశప్రజలకు స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఎలానో తెలంగాణ ప్రజలకు జూన్‌ 2‌న ఆవిర్బావ దినో త్సవం అలాంటిదేనన్నారు. కార్యక్రమంలో జిల్లా  కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, ‌పోలీస్‌ ‌కమీషనర్‌ ‌తఫ్సీర్‌ ఇక్బాల్‌, ఎంఎల్‌సి బాలసాని )క్ష్మీనారాయణ, నగర మేయర్‌ ‌డాక్టర్‌ ‌పాపాలాల్‌, ‌జడ్పీచైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ•, ఎంఎల్‌ఏలు సండ్ర వెంకట  వీరయ్య, లావుడ్యా రాములునాయక•,విత్తనాభివృధ్ది సంస్తచైర్మన్‌ ‌కొండబాల కోటేశ్వరరావు తదితరులు  పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌లో…
ఖమ్మం నగరంలోని జిల్లా పరిషత్‌ ‌కార్యాలయం ఆవరణలో మంగళవారం రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌ ‌జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ  ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, అభివృధ్ది, సంక్షేమం రెండు కళ్లుగా జిల్లా ముందుకు సాగుతుందన్నారు  ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌సిఇఓ ప్రియాంకతోపాటు ఉద్యోగులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో…
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో మంగళవారం ఘనంగా జరిగింది. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఎం‌డి ఖమర్‌ ‌జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ కార్యదర్శి వేల్పుల అర్జున్‌, ‌గ్రంధపాలకులు,ఉద్యోగులు భాస్కర్‌, అఖిల్‌, ‌కనకపల్లి కోటేశ్వరరావు ఇతర సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయంలో…
ఖమ్మం అర్బన్‌, ‌జూన్‌ 2, (‌ప్రజాతంత్ర విలేకరి) : ఖమ్మం జిల్లా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడు••లు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి స్వప్నం కోటి ఎకరాల మాగాణి కోరిక నెరవేర్చటమని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌, ‌రాష్ట్ర విత్తనాభివృధ్ది సంస్త చైర్మన్‌ ‌కొండబాల కోటేశ్వరరావు, జిల్లా  రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు,ఖమ్మం పట్టణ టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కమర్తపు మురళి, స్వర్ణకుమారి, కార్పోరేటర్లు  పగడాల నాగరాజు, షౌకత్‌ అలీ, మహబూబ్‌, ఆలీ, నీరజ, పోట్ల వీరేందర్‌, ‌నాయకులు బిచ్చాల తిరుమలరావు, డోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లిలో…
image.png

గరిడేపల్లి, జూన్‌ 2(‌ప్రజాతంత్ర విలేకరి) :  ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆంధ్రపాలకుల అరచాకాలను ఎండగడుతూ యావత్‌ ‌తెలంగాణ ప్రజానీకాన్ని ఏతతా టిపైకి తీసుకొచ్చి స్వరాష్ట్రం సాధించడంలో కేసీఆర్‌ ‌చేసిన కృషి మరువలేనిదని టీఆర్‌ఎస్‌ ‌మండలాధ్యక్షులు జోగు అరవింద్‌రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం  ఏ విధంగా అయితే కృషి చేశారో పసిడి పంటల పచ్చని మాగాణి కోసం ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోరెడ్డి శైలజ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్‌, ‌సర్వారం పీఏసీఎస్‌ ‌చైర్మన్‌ ‌వీరంరెడ్డి శంభిరెడ్డి, కడియం స్వప్న వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ ‌త్రిపురం సీతారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్సూర్‌అలీ, యూత్‌ అధ్యక్షులు కోల వీరబాబు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో…
మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ బీజేవైఎం జిల్లా •పాధ్యక్షులు బోద అరవింద్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌పోకల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు అందె కోటయ్య మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకొచ్చిన కేసీఆర్‌ ‌నేడు స్వార్థపూరిత రాజకీయాలతో నీరుగారిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసమన్వయసమితి మండల కమిటీ సభ్యులు సుందరి రమేశ్‌, ‌బొమ్మ బాలకృష్ణ, మలికంటి శ్రీనివాస్‌, ‌కొమర్రాజు లక్ష్యాది, ఎర్రంశెట్టి వనజా వెంకటేశ్వర్లు, నాగెల్లి సైదులు, మేకల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
టీడీపీ లేఖతోనే తెలంగాణ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఇచ్చిన లేఖతోనే తెలంగాణ ఆవిర్భావం సాధ్యమైందని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు మండవ వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్‌ ‌కట్‌ ‌చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు సకల జనులు తెలంగాణ కోసం ఉద్యమిస్తే, ఆ ఉద్యమ ఫలాలు నేడు కొందరికే లభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ఎస్‌కే.అలీ, మండల ప్రధాన కార్యదర్శి నేలపట్ల అంజయ్యగౌడ్‌, ‌కొమ్ము మధు, సీనియర్‌ ‌నాయకులు బొమ్మగాని వెంకటేశ్వర్లు, సతీష్‌, ‌సురగాని ఆనంద్‌, ‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లిలో …
కారేపల్లి, జూన్‌ 2, (‌ప్రజాతంత్ర విలేకరి) : సింగరేణి మండలంలో మంగళవారం రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా ఎండివో ఆఫీస్‌లో ఎంపిపి మాలోతు శకుంతల, ఎంఆర్‌వో ఆఫీస్‌లో ఎంఆర్‌ఓ ‌డి పుల్లయ్య, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ‌వెంకన్న, ఎంఇఓ ఆఫీస్‌లో జడ్‌ ఏసుదాస్‌, ‌విశాల సొసైటీ ఆఫీస్‌లో చైర్మన్‌ ‌దుగ్గినేని శ్రీనివాసరావు, జూనియర్‌ ‌కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎం ‌సింహాచలం, మండల పరిదిలోని 41 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు, సెక్రటరీలు, జెండా ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా ఎంఆర్‌ఓ ఆఫీస్‌లో ఎంఆర్‌ఓ ‌డి పుల్లయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా పాల్గొన్న ఎంపిపి మాలోతు శకుంతల,జడ్పిటిసి వాంకుడోతు జగన్‌లు మాట్లాడారు. సో•సైటీ చైర్మన్‌ ‌దుగ్గినేని శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ ‌హనుమకొండ రమేష్‌లు, ఎంఇఓ జడ్‌ ఏసుదాసు, ఎంపిటిసిలు పాండ్యానాయక్‌, ‌శివరాత్రి పార్వతి, జడల వసంత, మండల అధికారులు, మండల టిఆర్‌ఎస్‌ ‌నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply