Take a fresh look at your lifestyle.

సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యం

ఎనిమిదేళ్లలో తలదించుకునే పనిచేయలేదు
గాంధీ, పటేల్‌ ‌కలలుగన్న భారతావని కోసం కృషి
పేదల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాలు
గుజరాత్‌ ‌పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ

గాంధీనగర్‌, ‌మే 28 : గత ఎనిమిదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని ఏదీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌ ‌రాజ్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ని శనివారం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ప్రధౄని మాట్లాడుతూ…మహాత్మా గాంధీ, సర్దార్‌ ‌పటేల్‌ ‌కలలుగన్న భారతాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అన్నారు. గత ఎనిమిదేళ్ల భాజపా పాలనలో పేదల సంక్షేమం సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు ప్రధాని. సబ్‌ ‌కా సాత్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌, ‌సబ్‌ ‌కా విశ్వాస్‌, ‌సబ్‌ ‌కా ప్రయాశ్‌ ‌నినాదాల ద్వారా దేశాభివృద్ధికి ఊతమిచ్చినట్లు చెప్పారు. వివిధ పథకాల ద్వారా దేశంలోని పేదల అభ్యున్నతికీ పనిచేస్తున్నామన్నారు. తద్వారా వారి జీవితాలను మెరుగు పరిచేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కొరోనా సమయంలో పేద ప్రజల కోసం ఆహార ధాన్యాల నిల్వలను తెరిచినట్లు మోదీ చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు అందజేసినట్లు గుర్తుచేశారు.

- Advertisement -

అంతకుముందు నూతన ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని.. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. రాజ్‌కోట్‌లోని అట్కోట్‌లో శ్రీ కేడీ పర్వాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ని మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. నేడు గుజరాత్‌ ‌గడ్డపైకి వొచ్చానని, గుజరాతీలందరికీ తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. మాతృభూమికి సేవ చేయడంలో ఏ అవకాశాన్నీ తాను వదిలిపెట్టలేదని చెప్పారు. సమాజం కోసం ఏ విధంగా జీవించాలో గుజరాతీలు తనకు నేర్చారన్నారు. గుజరాతీలు నేర్పిన విద్య, విలువల వల్ల తాను జన్మభూమికి సేవ చేసే ఏ అవకాశాన్నీ వదిలిపెట్ట లేదన్నారు. కేంద్రంలో ఏర్పడిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ సేవలో ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంటోందన్నారు. ఈ ఎనిమిదేళ్ళలో తాము పేదలకు సేవ చేయడం, వారి సంక్షేమం కోసం కృషి చేయడం, సుపరిపాలనను అందించడానికే ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ’అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’ అనే మంత్రాన్ని తాము అనుసరిస్తున్నామని చెప్పారు. దేశాభివృద్ధికి నూతన ప్రేరణను ఇచ్చామన్నారు.

మహాత్మా గాంధీ, సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌ ‌కలలుగన్న భారత దేశాన్ని నిర్మించేందుకు ఈ ఎనిమిదేళ్ళలో నిజాయితీగా కృషి చేశామని చెప్పారు. పేదలు, దళితులు, బాధితులు, గిరిజనులు, మహిళలు సాధికారులను చేసే భారత దేశం కావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం జీవన విధానంగా ఉన్న సమాజం కోసం కలలు గన్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దేశీయ పరిష్కారాలు ఉండాలన్నారని తెలిపారు. కోవిడ్‌-19 ‌మహమ్మారి గురించి ప్రస్తావిస్తూ, పేదల కోసం ప్రభుత్వం ఉన్నట్లయితే, అది వారికి ఎలా సేవ చేస్తుందని ప్రశ్నిస్తూ, వారిని సాధికారులను చేయడానికి పని చేస్తుందన్నారు. నేడు యావత్తు దేశం దీనినే చూస్తోందన్నారు. వందేళ్ళలో అతి పెద్ద సంక్షోభం కోవిడ్‌ ‌వొచ్చిన సమయంలో కూడా యావత్తు దేశం దీనిని చూసిందన్నారు. ఈ మహమ్మారి ప్రారంభమైనపుడు పేదలకు ఆహారం, తాగునీరు సమస్యలుగా మారాయన్నారు. దీంతో తాము దేశంలోని ఆహార ధాన్యాల గోదాములను తెరిచామన్నారు.

Leave a Reply