Take a fresh look at your lifestyle.

ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో.. అక్రమ డిప్యూటేషన్ల లొల్లి

  • కొరోనా వేల ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులు, గ్రామీణ ప్రజలు
  • సీజనల్‌ ‌వ్యాధులపై అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా వైద్యశాఖలో అక్రమ డిప్యుటేషన్ల లొల్లి మొదలైంది. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాలో పని చేయాల్సిన సిబ్బంది అక్రమ డిప్యుటేషన్లతో నగరాలకే పరిమితం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోవడం లేదన్నా విమర్శలు ఉన్నాయి. నచ్చిన వారిని డిప్యుటేషన్ల పేరుతో నగరంలో పోస్టింగ్‌లు ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందకుండా పోతుంది. కొరోనా వైరస్‌ ‌విస్తరిస్తున్న ఆరోగ్య శాఖకు పై మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో కొరోనా కేసులు పెరుగుతుడడంతో ఆరోగ్య శాఖ అధికారులకు, ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌ ఏది అవసరమున్న చేసుకోండిని అవకాశం ఇచ్చారు. కలెక్టర్‌ ఇచ్చిన స్వేచ్ఛను ఉన్నతాధికారులు ఇచ్చిన వేసులు బాటు వరంగల్‌ ‌జిల్లా వైద్యాధికారులు అబసుపాలు చేస్తున్నారు. ఒక వైపు కొరోనా మరోసారి విజృభిస్తున్న సమయంలో దీనికి తోడు సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలే సమయంలో వైద్యాధికారులు వ్యవహరిస్తున్న తీరు జిల్లా కలెక్టర్లును ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా వైద్యశాఖలో అక్రమ డిప్యూటేషన్ల లొల్లి మొదలైంది. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాలో పని చేయాల్సిన సిబ్బంది అక్రమ డిప్యుటేషన్లతో నగరాలకే పరిమితమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోవడం లేదన్నా విమర్శలు ఉన్నాయి. నచ్చిన వారిని డిప్యూటేషన్ల పేరుతో నగరంలో పోస్టింగులు ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందకుండా పోతుంది అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాలలో విధులు నిర్వహించాల్సిన హెల్త్ ఎడ్యుకేటర్‌ ‌వెంకటేశ్వరరాజు వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా డిఎంహెచ్‌వో కార్యాలయలో గత ఏడాది కాలంగా తిష్ట వేశారు. దీంతో గ్రామంలో కలిపించాల్సిన అవగాహన సదస్సులు నిలిచిపోయాయి. సీజనల్‌ ‌వ్యాధులపై అవగాహన కల్పించే విధులు నిర్వహించాల్సిన అధికారి ప్రస్తుతం వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా డిఎంహెచ్‌ఓ ‌కార్యాలయంలో విదులు నిర్వహిస్తున్నాడు. గ్రామాలకు వెళ్ళకుండా రూ.లక్షకు పైగా జీతం తీసుకుంటున్న ఆ అధికారి ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ ‌చేసే విధులను వరంగల్‌ ‌నగర కార్యాలయంలో నిర్వహిస్తున్నాడు. అదే జిల్లా మహాముత్తారంలో పని చేయాల్సిన కమ్యూనిటీ హెల్త్ ఆఫిసర్‌ ‌కె.విద్యాసాగర్‌ ‌సైతం వరంగల్‌ ‌జిల్లాలో డిప్యూటెషన్‌పై విదులు నిర్వహిస్తున్నాడు.

కొరోనా విజృంబిస్తున్న సయయంలో కమ్యూనిటీ హెల్త్ అఫీసర్‌ ‌పాత్ర చాల కీలకం. హెల్త్ ఎమర్జెన్సీలో వీరు మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ప్రతి రోజు గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి సీజనల్‌ ‌వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేస్తూ మిగితా సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, రాష్ట్ర ఆరోగ్య కార్య క్రమాలు పర్యవేక్షిస్తూ పై అధికారులకు ప్రతి రోజు రిపోర్టు పంపించాల్సి ఉండగా అలాంటి కార్యక్రమాలు ఏమి నిర్వహించకుండా డిప్యుటేషన్‌ ‌పేరుతో దర్జాగా వరంగల్‌ ‌సిటీలో పని చేస్తున్నారు. వాస్తవానికి డిఎంహెచ్‌ఓ ‌కార్యాలయంలో ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ ‌చెయ్యాల్సిన పనిని నెలకు రూ.లక్షకు పైగా జీతం తీసుకునే వ్యక్తి చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కీలక విధులు నిర్వహించే వారిని భూపాలపల్లి నుండి డిప్యూటేషన్‌ ‌మీద తీసుకురావడం వల్ల అక్కడ పేద ప్రజలకు అందాల్సిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు జరగకుండా పోతున్నాయి అనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలలో వర్షాకాలం సీజనలో పేదలు సరైన అవగాహన లేక తీవ్ర జబ్బుల భారీన ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరో అధికారి వర్ధన్నపేటలో పని చేయాల్సిన డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ‌మధు జిల్లా స్థాయి అధికారితో సఖ్యతగా ఉంటూ డిప్యూటేషన్‌ ‌పై డిఎంహెచ్‌ఓ ‌కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలకు సంబంధించిన అంశంతో పాటు పలు బిల్లులు చేసే కీలక విభాగం విధులు నిర్వహిస్తున్నాడు. అంతే కాదు. (బాల స్వస్త్య ఆరోగ్య కార్యక్రమం…ఆర్‌బిఎస్‌కె) స్వంత వాహనం పెట్టుకోని అవగాహనా కార్యక్రమాలకు వెళ్ళాలి కాని జిల్లా కేంద్రంలోనే ఉంచి బిల్లులు తీసుకుంటున్నారనే ఆరోపణలు జిల్లా కార్యాలయంలో వినిపిస్తున్నాయి. నల్లబెల్లి పిహెచ్‌సి నుండి ముగ్గురు సిబ్బందిని డిప్యూటేషన్‌ ‌క్రింద తీసుకున్నారు. రెండు నెలల క్రితం నల్లబెల్లి పిహెచ్‌సి నుండి ఇంచార్జి డిపిహెచ్‌ఎన్‌ ‌గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, రూరల్‌ ‌కార్యాలయానికి డిప్యూటేషన్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఇదే నల్లబెల్లి పిహెచ్‌సిలో ఇప్పటికే ఒక హెల్త్ ‌సూపర్‌వైజ్‌ర్‌, ఒక సబ్‌ ‌యూనిట్‌ అధికారి ఇప్పటికే డిప్యూటేషన్‌లో జిల్లా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

ఒకే పిహెచ్‌సి నుండి ముగ్గురిని డిప్యూటేషన్‌లో తీసుకుంటే నల్లబెల్లిలో హెల్త్ ‌సూపర్‌వై•ర్‌ ఎవరూ లేకుండా పోవడంతో అక్కడ ఆరోగ్య కార్యక్రమాలు నిలిచిపోయాయి. వాస్తవానికి ఎక్కువ సూపర్‌వైజర్ల ఉన్న పిహెచ్‌సిల నుండి ఒక్కరిని తీసుకోనే అవకాశం ఉంటుంది. కాని ఒక్క నల్లబెల్లి నుండే నుండి ముగ్గురిని తీసుకోవడంలో పకడ్భందీ మతులబు నడిచింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఇటీవల సంగెం పిహెచ్‌సి నుండి ఒక సూపర్‌వైజర్‌కి డిప్యూటేషన్‌ ఇచ్చారు. వాస్తవానికి సంగెం పిహెచ్‌సిలో సూపర్‌వైజర్‌ ‌పోస్టు ఒక్కటే ఉంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న అతను డిప్యుటేషన్‌పై రావడంతో సంగెం పిహెచ్‌సిలో విదులు నిర్వహించే వారు లేక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుంది. వరంగల్‌ ఎం‌జిఎంలో కొరోన రోగులకు చికిత్స అందించే నోడల్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. వరంగల్‌ ఎం‌జిఎంలో సిబ్బంది కోరత తీవ్రంగా ఉంది.. అక్కడ విదులు నిర్వహించే ఓ సెక్షన్‌ అదికారి యూనియన్‌ ‌నేతగా ఉండి వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా కార్యాలయానికి డిప్యూటేషన్‌ ‌తెచ్చుకున్నాడు. ఏడాది కాలంగా డిప్యూటేషన్‌లో ఉన్న ఆయనకు ఇప్పటి వరకు ఏలాంటి విదులు కేటాయించలేదు. దీంతో వారం పది రోజులకు ఒక్కసారి కార్యాలయానికి వచ్చి సంతకం చేసుకోని వెళ్తున్నాడు. ఆత్మకూర్‌లో పని చేసే మరో యూనియన్‌ ‌నేతది ఇదే పరిస్థితి. ఇలా వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాలో అక్రమ డిప్యూటేషన్‌లలో ఇంకా చాలా మంది పని చేస్తున్నారు. వారం పది రోజులకు ఒక్కసారి కార్యాలయానికి వచ్చి అటెండెన్స్‌లో సంతకం చేసి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇక ప్రైమరీ హెల్త్ ‌పెంటర్ల పైనా కుడా పర్యవేక్షణ కోరవడింది. పరకాల రాయపర్తి గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ ‌సెంటర్‌కి వైద్యుడు సరిగా రాడంటూ గ్రామస్తులు ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ పట్టించుకున్న నాదుడు లేడు. చాలా ఆస్పత్రులకు వైద్యులు వారానికి• రెండు రోజుల మాత్రమే వెళ్ళివస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. నెల వారి మాముళ్ళ మత్తులో పడ్డ జిల్లా వైద్యాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడు నెలల నుండి వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లాలో 104 వాహనాలు ఆర్‌బిఎస్‌కె వాహనాలు సరిగా నడుపకపోవడం వల్ల గ్రామాలలో పేద ప్రజలు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా వైద్యాధికారి మాత్రం ఆక్రమ డిప్యూటేషన్లు ఎవి లేవని, రాష్ట్రా స్థాయి అధికారుల నుండి వచ్చిన ఆర్టర్ల ప్రకారమే విదులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఒక్కరిద్దరు యూనియన్‌ ‌నేతలు మాత్రం విదులు కేటాయించ లేదు వాళ్ళు యూనియన్‌ ‌పనుల్లో ఉన్నారంటున్నారు.వరంగల్‌ ఆర్బన్‌ ‌జిల్లాలో కొరోనా నివారణ కోసం కొనుగోళ్ళలో ఆక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.

వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో ఒక్కసారిగా కొరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరగడంతో జిల్లా ఉన్నాతాధికారులు ఇచ్చిన వెసులు బాటుకు ఆసరా చేసుకున్న వైద్య సిబ్బంది ఆక్రమాలకు తెర తీశారనే ఆరోపణలు ఉన్నాయి. త్రీ లేయర్‌ ‌మాస్కులు సానిటైజర్లు, ఎన్‌-95 ‌మాస్కులు, పిపిఈ కిట్లు, గ్లావుజులు ఇలా చాలా వస్తువుల కొనుగోళ్ళలో జిల్లా కార్యాలయంలో పని చేసిన సిబ్బంది కనీసం కోటెషన్లు చెప్పించకుండానే నచ్చిన వారి దగ్గర •రేటు ఎక్కవ పెట్టి కొన్నారన్ని విమర్శలు వస్తున్నాయి. ఇలా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ఆరోగ్య శాఖ లో వివాదాలు, ఆక్రమాలతో ఆబాసు పాలవుతుంది.కొరోనా బిజిలో అధికారులు వైద్య సిబ్బంది తీరును చూసి చూడనట్లు వదిలేయడంతో ఇష్టానుసారంగా వ్యవహారిస్తు ఉన్నతాధికారులకు మాట తెచ్చేలా చేస్తున్న తీరుపై ఇప్టటికైన దృష్టి సారించకపోతే పేద రోగులకు నష్టం కలుగడమే కాదు. ప్రభుత్వ డబ్బు వృదా కానుంది. ఇప్పటికైనా ఆరోగ్య శాఖలో జరుగుతున్న తీరు పై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నాతురు.

మదుసూదన్‌ ‌వరంగల్‌ ‌రూరల్‌ ‌డిఎంఆండ్‌హెచ్‌ఓ:
‌కలెక్టర్‌ ‌నిర్ణయం మేరకు మేము పని చేస్తున్నామని, ఆయా ఆరోగ్య రీత్యా కొంత మంది డిప్యూటేషన్‌పై వచ్చారన్నారు. కలెక్టర్‌ ‌సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, అక్రమ డిప్యూటేషన్లు లేవని, ఏ జిల్లా వారు ఆ జిల్లాలోనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. వేరే చోట ఎక్కువగా ఉన్న సిబ్బందిని మాత్రమే ఇక్కడికి డిప్యూటేషన్‌పై తీసుకున్నామన్నారు.

Leave a Reply