Take a fresh look at your lifestyle.

ఘనంగా ఏరువాక సంబురాలు

రైతులను సంఘటితం చేయడమే కేసీఆర్‌ ‌సంకల్పం : మంత్రి 

సూర్యాపేట, జూన్‌ 5, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం విధ్వంసం అయిందని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఆత్మకూర్‌(ఎస్‌) ‌మండలంలో  ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఏకకాలంలో 150మంది రైతులతో మంత్రి సైతం నాగలితో పోలంలో సాగు చేసి ఏరువాక పౌర్ణమి సంబురాలు నిర్వహించారు. మంత్రికి తోడు తనయుడు వేమన్‌ ‌రెడ్డి నాగలి పట్టి రైతులతో సమానంగా సాగు చెయ్యడం ఏరువాక పౌర్ణమి ఉత్సావాలకే ఆకర్షణగా నిలించాయి. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటుఅయిన తరువాతనే వ్యవసాయం గాడిలో పడిందని, అందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని అన్నారు. రైతును రాజు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రూపొందించిన ప్రణాళికలు సత్ఫాలితాలు వస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన సమైక్య పాలనలో ఉత్పన్నమైన పరిస్థితుల నుండి బయటపడటానికి 6సంవత్సరాల కాలం పట్టిందని గుర్తుచేశారు. మొదటిగా 24లక్షల వ్యవసాయపు పంపు సెట్లకు 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అం‌దించడం చారిత్రాత్మకమైందన్నారు. అలాగే తొలకరి జల్లుతో అప్పు కోసం రైతు అవస్థలు పడకుండా ఉండే విధంగా రైతుబందు పథకాన్ని అందిజేస్తున్నామని అన్నారు. అదే విధంగా సహజ మరణాలకు సైతం భీమా వర్తించేలా రైతుభీమా పథకాన్ని అమలులోకి తెచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాకు పారిండం, కృష్ణా, మూసిలను ప్రణాళిక బద్దంగా వినియోగించుకోవడంతో రైతుల కళ్ళల్లో ఆనందం వెళ్లి విరుస్తుందన్నారు. ప్రపంచ దేశాల అవసరాలను గుర్తించి ఏ ఏ పంటలు ఎప్పుడెప్పుడు వెయ్యాలి అన్న చైతన్యం తెచ్చేందుకు నియంత్రిత సాగుకు ముందు పెట్టారని తెలిపారు. డిమాండ్‌లో ఉన్న పంటలను మాత్రమే పండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్‌ ‌చైర్మన్‌ ‌గుజ్జ దీపికా, ఎంపి బడుగుల లింగయ్య, జెడ్పివైస్‌ ‌చైర్మన్‌ ‌వెంకట్‌ ‌నారాయణ గౌడ్‌ ‌తదితరులు ఉన్నారు.
రైతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర
image.png

ఖమ్మం,జూన్‌ 5, ‌ప్రజాతంత్ర (ప్రతినిధి): ఏరువాక పౌర్ణమి పురష్కరించుకుని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రైతులు ఏరువాక కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిం చారు. తొలుత గోమాతలను ప్రత్యేకంగా అలంకరించి, వ్యవసాయ పనిముట్లకు ,గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు రైతులకు ఎదురుగా వచ్చి హరతులు ఇచ్చి పంటలు బాగా పండలని,వర్షాలు సమృద్దిగా పడాలని వేడుకున్నారు.  సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య అరకపట్టి ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు.  సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో  ఏరువాక పౌర్ణమి సందర్బంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రై•తాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరువాక అంతే దుక్కు దున్ని , వ్యవసాయం ప్రారంభించడమన్నారు. పంటలు బాగాపండి , పొలంలో పంట చేతికి వస్తేనే రైతు కష్టాలు తీరుతాయన్నారు. అందుకే  మన దేశంలో వ్యవసాయాన్ని ఓ పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తామన్నారు. రైతాంగం దేశాన్ని సస్యశామలం చేసి , మానవాళి అకాల తీర్చె చల్లని తల్లి , భూమాత అలాంటి తల్లి గుండెల పై నాగలి గుచ్చి, దుక్కు దున్నడం రైతన్నకు బాధాకరమైన విషయం అయినా , బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదన్నారు. అందుకే  వ్యవసాయ ప్రారంభానికి ముందు , భూపుజా చేసి, ఆ తల్లి ఆశీస్సులందుకునేదుకు చేసే పండగే ఏరువాక పౌర్ణమి అని వివరించారు. విశిష్ట సంప్రదాయాలు ఉన్న వ్యవసాయాన్ని మన రైతన్నలు దైవంగా భావిస్తారని అన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కే. సి. ఆర్‌  ‌రైతు బంధు, రైతు రుణమాఫి వంటి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రైతును రాజు చేయాలనే ఆశయంతో రైతు పండించిన పంట ధర రైతే నిర్ణయించాలనే సంకల్పంతో నియంత్రణ సాగు విధానాన్ని అమలు పరిచారని రైతుల అందరు ఈ  నియంత్రణ సాగు విధానాన్ని అమలుకు శ్రీకారం చుట్టాలన్నారు. ఈ పంట నుండే నియంత్రిత సాగును కొనసాగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

Leave a Reply