Take a fresh look at your lifestyle.

ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రతినిత్యం హైదరాబాదులో వేలాదిమంది ప్రజలు కొత్తగా వస్తున్నారని ఈ నేపద్యంలోనే ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య గాని, రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి సమస్యలు చిన్న చిన్నవి తలెత్తిన పునరుద్ధరిస్తూ వస్తున్నామని, ప్రజలు కూడా ఇందుకు సహకరిస్తున్నందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మూసాపేట్ లోని ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా పి.ఆర్ నగర్, అవంతి నగర్, బబ్బుగూడ మొదలగు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ నేపద్యంలోని బబ్బుగూడలోని నాలా సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళ హారతులు అందించారు. అలాగే కొంతమంది వృద్ధులు పింఛన్లకు సంబంధించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకురాగా వారి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులకు అందించి వెంటనే మంజూరు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలు పెన్నులు బ్యాగ్ కిట్లను బాబ్బుగూడ పాఠశాలలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మూసాపేట్ డివిజన్లో పాదయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పూర్తయిన నాలుగు డివిజన్లో సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లు తీసుకున్న ప్రణాళికల ప్రకారంగా భవిష్యత్తులో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ 100 శాతం ప్రక్షాళన జరుగుతుందని ఇందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఇటువంటి ముందు చూపు ఉన్న నాయకులు మనకు దొరకడం అదృష్టమని తెలిపారు. పొరపాటున తెలంగాణ రాష్ట్రాన్ని వేరే పార్టీ చేతిలో పెడితే అస్తవ్యస్తమవడం ఖాయమని దీన్ని ప్రజలు గమనించి బిఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply