Take a fresh look at your lifestyle.

ఢిల్లీ హింస.. హిందూ, ముస్లింల మధ్య పెరుగుతున్న అపనమ్మకం

“కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారు.ఎంతైనా చేస్తారు. ఒక సామాజికవర్గంపై మరో సామాజికవర్గానికి ద్వేషం కలిగించడానికి వెనుకాడరు. విద్వేషం సమీకరణల వెనక కారలపై లోతుగా అధ్యయనం జరిపితే  ముస్లింలలో పెరుగుతున్న అసంతృప్తి, వారికి దక్కాల్సినవి దక్కకపోవడమేనని అంటారు.”

ఢిల్లీలో హింసకు కారకులెవరు, ప్రేరకులెవరు అనే అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఈ హింసలో అధికార గణాంకాల ప్రకారం 53 మంది మరణించారు. ఇందుకు బాధ్యులు మీరంటే మీరు అని హిందూ,ముస్లింలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. కొంతమంది రాజకీయనాయకులు చేసిన విద్వేషిత పూరిత ప్రసంగాలే ఈ హింసకు కారణమా ? ఒక వేళ నిజమే అయితే ఎంతవరకూ అవి కారణం ? ఈ చర్చ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ హింసలో సర్వస్వాన్ని కోల్పోయిన ప్రజలు సమీకరణ అవుతున్నారు. కొందరు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారు.ఎంతైనా చేస్తారు. ఒక సామాజి కవర్గంపై మరో సామాజికవర్గానికి ద్వేషం కలిగించడానికి వెనుకాడరు. విద్వేషం సమీకరణల వెనక కారలపై లోతుగా అధ్యయనం జరిపితే ముస్లింలలో పెరుగుతున్న అసంతృప్తి,. వారికి దక్కాల్సినవి దక్కకపోవడమేనని అంటారు. 2014లో ఓహియో యూనివర్శిటీకి చెందిన అనిర్బాన్‌మిత్రా, న్యూయార్క్ ‌యూనివర్శిటీకి చెందిన దేవ రాజ్‌ ఈ ‌నిర్ధారణకు వచ్చారు. సమాజంలో అసమానతల కారణంగానే ఇలాంటి ద్వేషాలు పెరుగుతున్నాయన్నది వారి అభిప్రాయం. 1950 నుంచి 2000 వరకూ జాతీయ శాంపిల్‌ ‌సర్వే సంస్థ సేకరించిన గణాంకాల ప్రకారం తలసరి నెలవారీ వ్యయం పరిశీలిస్తే హిందువుల ఆదాయం బాగా పెరుగుతోంది. ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఇందుకు భిన్నంగా ముస్లింల తలసరి వ్యయం బాగా తగ్గుతోంది.

వీటికి తోడు మతపరమైన అల్లర్లు ఉండనే ఉన్నాయి. 1950-81 మధ్య ఏటా 16 మత ఘర్షణలు జరిగాయి. 1980, 1990 దశకాల మధ్య అయోధ్యలో రామజన్మ భూమి ప్రాంతంలో రామాలయం నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆ సంఘటనలు బాగా తగ్గాయి. అప్పుడప్పుడు అలాంటి సంఘటనలు జరిగేవి.హిందువుల తలసరి వ్యయం ఒక శాతం పెరిగినప్పుడల్లా ఘర్షణల్లో మరణాలు మూడు నుంచి 7 శాతం తగ్గాయి. ముస్లింల తలసరి వ్యయం పెరిగినప్పుడల్లా మరణాలు 3 నుంచి ఐదు శాతం నమోదు అయ్యాయి. ముస్లింలు ఇతర సామాజిక వర్గాల కన్నా మధ్యతరగతికి వేగంగా చేరుకుంటున్నారు. ఢిల్లీలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.
ముస్లింలకు అవకాశాలు తగ్గిపోవడం అనేది స్పష్టంగా కనిపిసతోంది. జాతీయ శాంపిల్‌ ‌సర్వే సంస్థ, సామాజిక శాస్త్రజ్ఞులు సంధ్యా కృష్ణన్‌ ‌నీరజ్‌ ‌హటెకార్‌ల అధ్యయనం ప్రకారం కొత్తగా ఏర్పడిన మధ్యతరగతి వర్గం రోజుకు రెండు నుంచి 10 అమెరికన్‌ ‌డాలర్లు ఖర్చు చేస్తోంది. అంటే రోజుకు 145 నుంచి 740 రూపాయిల వరకూ ఖర్చు చేస్తోంది 1999-2000 నుంచి 2011-2012 వరకూ ఈ గణాంకాలను సేకరించడం జరిగింది. ముస్లింలలో మధ్యతరగతి హిందూ మధ్యతరగతితో సమానంగా ఎదుగుతోంది. 1999-2000 నుంచి 2011-2012 వరకూ ముస్లిం మధ్యతరగతి 86 శాతం పెరిగింది. హిందు మధ్యతరగతి 76 శాతం మాత్రమే పెరిగింది.

- Advertisement -

ముస్లింల ఆదాయం పెరుగుదల
ముస్లింల ఆదాయం పెరుగుదల దేనిని సూచిస్తోంది. ముస్లింల వృత్తులు, వ్యాపకాలను బట్టి. యూపీఏ-1 హయాంలో ముస్లింల స్థితిగతులను పరిశీలించేందుకు సచార్‌ ‌కమిటీని నియమించారు.వ్యవసాయరంగంలో ముస్లింల వాటా బాగా తక్కువగా ఉన్నట్టు ఆ కమిటీ అంచ నా వేసింది. ముస్లింల భాగస్వామ్యం పొగాకు ఉత్పత్తులు, జౌళి, తయారు చేసిన మెటల్‌ ఉత్పత్తుల పరిశ్రమలల్లో ఎక్కువగా ఉంది. ఢిల్లీలోనే కాకుండా తమిళనాడు, ఉత్తర, మధ్య ప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌మహారాష్ట్రలలో ఎక్కువగా ఉంది. నైపుణ్యం గల కార్మికుల ఆదాయం బాగా పెరిగింది. ముస్లింలలో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముస్లింల ఎదుగుదలతో హిందువుల్లో తమ అవకాశాలు సన్నగిల్లడానికి ముస్లింలే కారణమన్న భావన ఏర్పడింది. నిజానికి ఇలాంటి భావన ముస్లింలలో కూడా ఉంది. హిందువులు తమ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారన్న భావన వారిలో ఉంది. దీనిని అవకాశంగా తీసుకుని రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ ఓట్ల వాటా 1.3 శాతం తగ్గింది. అల్లర్లకు హిందువుల ఓట్ల షేర్‌ ‌పెరగడానికి దగ్గర సంబంధం ఉంది. ఎన్నికల ముందు మాత్రం హిందూ జాతీయ పార్టీలు తమ ఓటు షేర్‌ ‌ను 0.8 శాతం పెంచుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్‌కి పడిన ఓట్లన్నింటినీ ఇప్పుడు బీజేపీ చేజిక్కించుకుంటోంది. ప్రజల్లో అపోహలను ఆసరాగా తీసుకుని ఆ పార్టీ ఓట్ల షేర్‌ ‌పెంచుకుంటోంది. ఢిల్లీలో అల్లర్లకు ప్రధానంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్‌ ‌షేర్‌ ‌పెంచుకునే యావలో సృష్టించిన అపోహలు, అనుమా నాలే కారణం. ఇందుకు కాంగ్రెస్‌ ‌కన్నా బిజేపీ ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply