Take a fresh look at your lifestyle.

రెవెన్యూ అధికారుల లంచావతారం

  • ఎసిబికి అడ్డంగా దొరికిన ఆర్‌ఐ,ఎస్‌ఐ
  • ఎమ్మార్వో ఇంట్లో రూ.30 లక్షలు పట్టివేత

హైదరాబాద్‌లో రెవిన్యూ అధికారుల అవినీతి బట్టబయలైంది. ఓ స్థల వివాదంలో 15లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్‌ఐ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఆర్‌ఐ ‌నాగార్జునతో పాటు బంజారాహిల్స్ ఎస్సై కూడా లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌ ‌పై కూడా కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లో ఒకటిన్నర ఎకరం భూ వివాదంలో వీళ్లు తలదూర్చినట్టు తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే సయ్యద్‌ అబ్దుల్‌ ‌కు చెందిన ఒకటిన్నర ఎకరాన్ని ప్రభుత్వం రెవిన్యూ స్థలంగా పేర్కొంది. అయితే స్థలం తమదేనంటూ అబ్దుల్‌ ‌కోర్టుకెళ్లాడు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. లాక్‌డౌన్‌ ‌టైమ్‌లో అబ్దుల్‌ ‌ప్రభుత్వ బోర్డు తీసేసి స్థలం స్వాధీనం చేసుకున్నాడు. దీంతో అబ్దుల్‌ ‌పై కేసు నమోదైంది. స్థల వివాదాన్ని పరిష్కరించడానికి ఆర్‌ఐ 50 ‌లక్షలు డిమాండ్‌ ‌చేశారు.

తన భూమికి హద్దులు చూపించాలని అబ్దుల్‌.. ‌షేక్‌ ‌పేట ఎమ్మార్వో ఆఫీస్‌లో దరఖాస్తు పెట్టాడు. అబ్దుల్‌ ‌పై బంజారాహిల్స్ ‌పోలీసులకు ఫిర్యాదు చేశారు షేక్‌ ‌పేట ఎమ్మార్వో. అబ్దుల్‌కు అనుకూలం చేయడానికి షేక్‌ ‌పేట ఆర్‌ఐ ‌లంచం అడిగారు. 3 లక్షలు డిమాండ్‌ ‌చేసిన బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌.. ‌లక్షన్నర తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు. దీంతో ఎస్సై రవీందర్‌ ‌పై కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. బంజారాహిల్స్ ‌లో ఒకటిన్నర ఎకరాల స్థల వివాదానికి సంబంధించి 30 లక్షల రూపాయలు ఎమ్మార్వో ఇంట్లో బయటపడ్డాయి. షేక్‌ ‌పేట ఎమ్మార్వో సుజాత ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అవినీతిరహిత పాలన కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటు న్నప్పటికీ కొంత మంది పోలీసులు మారడం లేదు. హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచం తీసుకొంటున్న పోలీసు, రెవెన్యూ అధికారులిద్దరిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న సంఘటన సంచలనం కలిగించింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy