Take a fresh look at your lifestyle.

మందిరాలు, మసీదులు కూల్చిన వారిని శిక్షించాలి

హైదరాబాద్‌ ‌సెక్రటేరియట్‌ ‌లో రెండు మసీదులు ఒక మందిరాన్ని కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ‌పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ ‌ఖాన్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. శుక్రవారం బూర్గంపాహడ్‌ ‌మండలం సారపాక మస్జిద్‌ ఎ ‌దావత్‌ ‌పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఫ్లకార్డులు పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనలు వ్యక్తం చేశారు.

మస్జిద్‌ ‌మందిరాలను కూల్చివేతకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో సర్ఫరాజ్‌ ‌సయ్యద్‌ ‌సలీం రెహమాన్‌ ‌షరీఫ్‌ ‌సయ్యద్‌ అహ్మద్‌ ‌యాకూబ్‌ ‌పాషా  పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply