- జలమయం అయిన లోతట్టు ప్రాంతాలు
- నీట మునిగిన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి
హైదరాబాద్ నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలీపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, సరూర్ నగర్, కర్మన్ఘాట్, కొత్తపేట్, వి•ర్పేట్, aకీసర, జవహర్నగర్, దమ్మాయిగూడ, నాగారం, నేరేడ్మెట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అనేకచోట్ల ఈదురు గాలులకు చెట్లు పడిపోయాయి. పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాగులు, వంకలు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. మరోసారి భాగ్యనగరాన్ని ముంచెత్తింది.
శనివారం మధ్యాహ్నం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేస్తోంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు పలు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శంకర్పల్లికి సవి•పంలోని మూసీవాగు, తీగల వాగు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వరద నీరు శంకర్పల్లి పట్టణంలోకి భారీగా చేరింది. పట్టణమంతా నదిని తలపిస్తోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. కొందరి నివాసాల్లో బియ్యంతో పాటు ఇతర వస్తువులు తడిసి ముద్ద అయ్యాయి. గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.