Take a fresh look at your lifestyle.

బిజెపితో కెసిఆర్‌ ‌లాలూచీ: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి

KCR Lalucci

బీజేపీతో కేసీఆర్‌ ‌లాలూచీ పడ్డారని గులాబీ దళపతి కేసీఆర్‌పై టి.కాంగ్రెస్‌ ‌పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. లోపాయకారి ఒప్పందాలతో బయటకు మాత్రం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో డియాతో మాట్లాడిన ఆయన.. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయబోమని కేసీఆర్‌ ఎం‌దుకు చెప్పట్లేదని ప్రశ్నలు గుప్పించారు. అసెంబ్లీలో దీనిపై ఎందుకు తీర్మానం చేయడం లేదన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల హాని కేసీఆర్‌ ‌గాలికి వదిలేశారని విమర్శించారు. చాలా విషయాల్లో మోదీ సర్కార్‌కు కేసీఆర్‌ ‌మద్దతు పలికారని అన్నారు. ఇదే సమయంలో పార్టీలో పదవుల కేటాయింపుపై మాట్లాడిన ఉత్తమ్‌.. ‌త్వరలోనే షబ్బీర్‌ అలీకి పార్టీలో కీలక పదవి రాబోతోందని వెల్లడించారు. అయితే అదేమిటనేది మాత్రం వెల్లడించలేదు. పిసిసి చీఫ్‌మైనార్టీ నేతగా ఉన్న షబ్బీర్‌కు కేటాయిస్తారా అన్నది చూడాలి.

కాంగ్రెస్‌ ‌ధర్నా సోమవారానికి వాయిదా..

రిజర్వేషన్లు ఎస్టీ, ఎస్సీ బీసీల హక్కుని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. శనివారం గాంధీభవన్‌ ‌లో ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విలేకరులతో చిట్‌ ‌చాట్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రిజర్వేషన్ల పై సుఫ్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు చేసిన వాదనలే కారణమని అన్నారు.ఆదివారం ఇందిరాపార్క్ ‌వద్ద కాంగ్రెస్‌ ‌నిర్వహించాలనుకున్న ధర్నా సోమవారానికి వాయిదా పడిందని ,ఈ ధర్నా కు పోలీసులు అనుమతి తిరస్కరించారని ఉత్తమ్‌ ‌తెలిపారు.

రిజర్వేషన్లు కాపాడుకోవాలి : షబ్బీర్‌
‌ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ ‌పార్టీదేనని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చే 12 శాతం రిజర్వేషన్ల మాట ఏమో గానీ, ఉన్న 4 శాతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. శనివారంతో కాంగ్రెస్‌ ‌పార్టీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీభవన్‌లో ఆయన గత 15 ఏళ్లుగా నాలుగు శాతం రిజర్వేషన్లతో ముస్లింలు ఏ విధంగా లబ్ది పొందారనే విషయంపై పవర్‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ఇచ్చారు.

పీసీసీ ఇంటి పెద్దలాంటి వాడు ఎవరు వ్యతిరేకించడం లేదు
ఇప్పట్లో పీసీసీని తొలగించాల్సిన అవసరం లేదనీ అధ్యక్షునిగా ఉత్తమ్‌ని కొనసాగించాలనే కోరుతాననీ, మార్పు తప్పదు అంటే తనకు అవకాశం ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నెహ్రూనే అన్నారు .

Leave a Reply