Take a fresh look at your lifestyle.

నేడు రాష్ట్ర కేబినేట్‌ ‌భేటి

telangana State Cabinet meeting today

రెవెన్యూ, అక్షరాస్యతా ఉద్యమం, నీటిపారుదల, శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలు తదితర అంశాలపై చర్చ

నేడు ప్రగతిభవన్‌లో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనున్నది.రాష్ట్రంలో అనేక కీలకాంశాలు చర్చనీయాంశమవుతున్న సందర్భంలో జరుగుతున్న ఈ భేటీకి అసాధారణమైన ప్రాముఖ్యత ఏర్పడింది.మున్సిపల్‌ ఎన్నికల్లో, ప్రాథమిక వ్యవసాయ పరపితి సంఘాల ఎన్నికల్లో విజయఢంకామోగించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనించతగ్గ విషయం.ఈ సమావేశంలో శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ ‌మొదటివారంలో శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింద్ణ్ణ్ణ్ణ్ణ్ణ్ణ్ణి కలెక్టర్‌ల సమావేశంలో చర్చించిన అంశాలను, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను, కాళేశ్వరంతో పెరుగుతున్న జలకళ, రెవెన్యూచట్టాలకు సవరణలు, పంచాయతీరాజ్‌ ‌సమ్మేళనాలు, సెకట్రేరియట్‌ ‌నిర్మాణం, తదితర అంశాలన్నింటినీ నేడు కేబినేట్‌ ‌మీటింగ్‌ ‌చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు భారీస్థాయిలో సవరణలు చేశారు.

ఈ శాఖను 11 సర్కిళ్లుగా విభజించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాళేశ్వరం పర్యటన సందర్భంలో ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల విజయం తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గల్ఫ బాధితుల కష్టాలను వివరించారు.వీరికోసం ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని సీఎం చాలా సార్లు ఉదహరించారు. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ ‌బాధితుల కన్నీళ్లను,కష్టాలను తొలిగించే విధంగా సమగ్ర విధానాన్ని తయారు చేసే విధానంపైన నిర్ణయాలు తీసుకోనున్నారు.కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ ‌ప్రకటించిన సుగంధద్రవ్యాల బోర్డుపైన మాట్లాడనున్నారు. సుగంధద్రవ్యాల బోర్డుపైన ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర టీఆర్‌ఎస్‌ ‌నేతలు విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, రిటైర్మెంట్‌ ‌వయస్సు పెంపు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.

Leave a Reply