Take a fresh look at your lifestyle.

దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే బొంద పెడతాం ..మాజీ మంత్రి నాగం

ప్రజాతంత్ర ,హైదరాబాద్ : పోతిరెడ్డిపాడు విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని మాజీ మంత్రి ,పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ నాగం జనార్ధనరెడ్డి విమర్శించారు .పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున నీళ్లు దోచుకుపోతున్న కేసీఆర్ కిమ్మనడం  లేదని మండిపడ్డరు .బుధవారం గాంధీభవన్ లో పోతిరెడ్డిపాడు వ్యతిరేక పోరాట  కమిటీ సభ్యులు మీడియా తో మాట్లాడుతూ …కేఆర్ఎంబి సబ్ కమిటీ నివేదిక ప్రకారం పాత హెడ్ రేగులేటరీ ద్వారా  70 వేల కూసెక్ లు పోతున్నాయని ,101 టీఎంసీ మాత్రమే ఏపీ  ప్రభుత్వం తీసుకోవాలని , కానీ ఇప్పటికే రోజుకు 4 టీఎంసీ చొప్పున 120 టీఎంసీ లు  తీసుకుపోతున్నారని తెలిపారు.

పాత హెడ్ రేగులేటర్ ఎందుకు మూత పెట్టలేదని ,సంగమేశ్వర్ ద్వారా మళ్ళీ రోజు కు 3 టీఎంసీ లు తిసుకుపోతున్నారని మండిపడ్డారు.తెలంగాణ కు ప్రతి ఏటా న్యాయంగా రావాల్సిన నీరు కూడా రావడం లేదన్నారు .ఇద్దరు సీఎం లు కలిసి నీటి దోపిడీ చేస్తున్నారని ,203 జీఓను వెంటనే రద్దు చేయించాలని లేకపోతే కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు.దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే బొంద పెడుతామని హెచ్చరించారు.తనకు పోతిరెడ్డిపాడు పై పోరాడే అవకాశం ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ,కమిటీ కన్వినర్ రామ్మోహన్ రెడ్డి ,మాజీ మంత్రి ,కమిటీ సభ్యులు చిన్నారెడ్డి,మాజీ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.

Tags: Former MLA, Committee Convenor Rammohan Reddy, Former Minister and Committee Members Chinna Reddy, Ex MP

Leave a Reply