Take a fresh look at your lifestyle.

ధరణి సమస్యలపై హరీష్‌ ‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం

ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ధరణి సమస్యలపై మంత్రి హరీష్‌ ‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌జగదీష్‌ ‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఉంటారు. మంత్రివర్గ ఉప సంఘానికి స్టాంపులు, రిజిస్టేష్రన్ల శాఖ సీఐజీ శేషాద్రి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇటీవల క్యాబినెట్‌ ‌తీర్మానం చేసిన మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉప సంఘం ధరణి సమస్యలపై పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Leave a Reply