Take a fresh look at your lifestyle.

ముమ్మాటికీ విమోచన దినమే ..

“తెలంగాణ ప్రజలపై దోపడీ అమానుషపాలన కొనసాగిస్తూ మహిళలను మానభంగాలు చేసి నగ్నంగా బతుకమ్మల ఆడించి పైశాచిక ఆనందాలు పొందిన నిజాం సర్కార్‌ను మొక్కవోని ధైర్యంతో ఎదిరించి సాయుధ పోరాటం చేసి దాదాపు 4500 మంది సహచారులను కోల్పొయి నియంత నిజాం మెడలు వంచి విజయం సాధించి నిజాం పాలన నుండి విముక్తి పొంది భారతమాత బడిలో చేరిన సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ చరిత్రలో విముక్తి పొందినట్లు చరిత్రకారులే కాదు. నాటి ఉద్యమకారులు – నేటి5 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారానికి రాకముందు సెప్టెంబర్‌ 17‌వ తేదీనే తెలంగాణ విముక్తి పొందిన దినం అని ఘంటాపథంగా చెప్పారు.”

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17‌వ తేదీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. 1724 నుండి 1948 వరకు అంటే దాదాపు 224 సంవత్సరాల సుదీర్ఘకాలం హైదరాబాద్‌ ‌నగరం, దక్కన్‌ ‌సంస్థానంగా పరాయి పాలనలో కొనసాగింది. దేశ చరిత్రకారులు చెప్పినట్లు భారతదేశంలో మొగల్స్ ‌సామ్రాజ్యం క్షీణించిన తరువాత స్వతంత్య్రంగా ఏర్పడిన రాజ్యాలలో దక్కన్‌ ‌సంస్థానం ఒకటి. అప్పటి వరకు పరిపాలనలో ఉన్న నిజాం పాలకులు ఫ్రెంచి వారితో సక్యతగా ఉన్నారు. ఆ తరువాత ఏర్పడిన రాజకీయ పరిణామాల వల్ల నిజాం పాలకులు బ్రిటీష్‌ ‌వారికి సామాంతులుగా మారారు. సామంతులుగా మారిన నాటి నుంచి అసాబ్‌ ‌జోహి వంశానికి చెందిన వీరు నిజాంలుగా చలామణి అయ్యారు. వీరిలో ఐదుగురు నిజాంల పాలనలో కొనసాగారు. ఇందులో మీర్‌ ‌ఖమ్రుద్దీన్‌ఖాన్‌, ‌నిజాం అలీఖాన్‌, ‌సికందర్‌జా, నసీరుద్దౌలా, అఫ్జల్‌ ‌దేల, మహబూబ్‌ అలీఖాన్‌, ‌మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌లు ఈ దక్కన్‌ ‌సంస్థానాన్ని పరిపాలించారు. వీరందరు కూడా హైదరాబాద్‌ ‌కేంద్రంగా దక్కన్‌ ‌సంస్థానాన్ని పరిపాలించారు. వీరంత వీరి పరిపాలనను ప్రత్యేక పాలన కొనసాగించారు. వీరికి ప్రజల సంక్షేమం కన్న వీరికి రాజభోగాలు, విలాసవంతమైన జీవితాలు కొనసాగించడానికే అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. ప్రజల నుండి అనేక రకాలుగా (శిస్తు)పన్నులు వసూలు చేయడం, రైతులు పండించిన పంటలను దోపిడీ చేయడం, రైతులను, రైతు కూలీలపై అమానుషంగా ప్రవర్తించడం క్రూరరత్వంగా ప్రవర్తించడం మహిళలను వారి కుటుంబాల ముందే మానభంగాలు చేయడం యువకులను అకారణంగా శిక్షించడం లాంటి చర్యలతో వీరు పైశాచిక ఆనందం పొందేవారు. వీరిపాలనలో ముస్లీంలకే ప్రాధాన్యత ఉండేది. వీరి సంస్థానంలో దేశ్‌ముఖ్‌, ‌జాగిరిదార్‌, ‌దొరల పాలన ఉండేది.

సామాన్య ప్రజలతో వీరికి సంబంధాలు ఉండేవి కాదు. ప్రజలతో సంబంధాలు లేకుండానే వీరి పరపాలనల కొనసాగేది. దాదాపు వీరు ఐదుగురు నిజాలు కూడా నియంతలుగానే వ్యవహరించేవారు. వీరిలో ఒక్క ఆరవ నిజాం అయిన మహబూబ్‌ అలీఖాన్‌ ‌మాత్రమే ముస్లీమేతరులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే మనస్తత్వంతో ఉన్నట్లు చరిత్రకారులు చెపుతారు. అయితే ఏడవ నిజాం పరిపాలనలోనే 1927 తరువాత ఖాసీం ర జ్వీ అనే సైనికో అధికారి రజాకార్లు అనే ప్రత్యేక సైనికులు ఏర్పాటు చేశారు. ప్రజలపై వీరి దాడులు అఘాయిత్యాలతో నిజాంలు అనగానే తెలంగాణ రైతాంగానికి నిజాంపాలన అంటేనే రజాకార్లు గుర్తుకువస్తారు. రజాకార్లు అంటేనే గ్రామాలపై పడి లూటీలు చేయడం, హత్యలు చేయడం, మానభంగాలు లాంటి అకృత్యాలు గుర్తుకువచ్చేవి. ఇప్పటికి రజాకార్ల జమాన గురించి మా తండ్రుల వయసున్నవారు చెప్పుకోవడం నేను ప్రత్యక్షంగా విన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే రజాకార్లు అని పేరు చెపితే పిల్లల నుండి ముసలీముడుగ అందరు భయపడేవారు.

తెలంగాణ జిల్లాలోని బైర్యాన్‌పల్లి, బీబీనగర్‌, ‌జనగామ, హుస్నాబాద్‌, ‌పరకాల, సైదాపూర్‌, ‌మొలంగూరు, వీనవంక తదతర అనే గ్రామాలలో నేటికి వీరి అకృత్యాలు కథలు కథలుగా చెప్పుకుంటారు. రజకార్లు అంటే శాంతిని కోరే అర్ధం ఉందట కానీ వీరి ప్రవర్తనలో మాత్రం ప్రజలను హింసించడమే ప్రథమంగా కనిపిస్తుంది. అయితే నిజాం పాలనలో అనేక మంది ముస్లీంలు కూడా అసహించుకునే దశకు వీరి అకృత్యాలు పెరిగాయి. ఫలితంగా తెలంగాణ విమోచన కోసం పోరాటం మొదలైంది. వేలాది మంది యువతీ, యువకులు నిజాం వ్యతిరేక సైన్యాలలో చేరారు. ముగ్దం మోహినోద్దీన్‌ ‌లాంటి ముస్లీంలే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. షోయబుల్లాఖాన్‌ ‌లాంటి జర్నలిస్టులు నిజాం అకృత్యాను నిర్భయంగా వార్తలు రాస్తే చేతులు నరికించి దారుణంగా హత్యలు చేశారు. దేశమంతటా 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం వస్తే దేశం సంబరాలు జరుపుకుంటే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు 1948 సెప్టెంబర్‌ 17‌న తేదీన నజాం పాలకుడు – ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌చివరి వరకు పోరాడి భారతదేశానికి తలవంచి లొంగిపోయారు. తెలంగాణ విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో దాదాపు 4500 మంది పోరాట యోధులను కడుపున పెట్టుకున్న నిజాం భారత ఉపప్రధానమంత్రి సర్దార్‌ ‌వల్లబాయి పటేల్‌ ‌దాటికి తట్టుకోలేక సెప్టెంబర్‌ 17‌వ తేదీన లొంగిపోయాడు. సెప్టెంబర్‌ 17‌వ తేదీన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది.. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడారు .
సాయుధపోరాటవీరులు.

1948 సెప్టెంబర్‌ 17‌వ తేదీన భారత ప్రభుత్వంలో కలిసిన తెలంగాణ ప్రాంతం-హైదరాబాద్‌ ‌రాష్ట్రంగా జరిగిన రాజకీయ పరిణామాల వల్ల నేటికి తెలంగాణ విమోచన దినం జరుపుకోలేని స్థితిలో తెలంగాణ ఉంది. అయితే నిజాం సంస్థానం నుండి సెప్టెంబర్‌ 17‌వ తేదీ 1948న విముక్తి పొందిన మరట్వాడ జిల్లాలు మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రంలోని జిల్లాలు-మైసూర్‌ ‌రాష్ట్రంలో విలీనం కాగా, వారికి 17వ తేదీన విమోచన దినోత్సవాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలే ఆ జిల్లాల్లో అధికారికంగా విమోచన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గడిచిన 70 సంవత్సరాల కాలంగా విముక్తిపొందిన తెలంగాణ ప్రాంతం అనాదలా మిగిలిపోయింది.
జోహార్‌ ‌తెలంగాణ విముక్తి పోరాట అమరవీరులకు జోహర్‌..
– ‌నాయిని మధునయ్య, సీనియర్‌ ‌జర్నలిస్ట్,
9849549248.

Leave a Reply