Take a fresh look at your lifestyle.

గ్లోబల్‌ ‌విజన్‌..

డిజిటల్‌ ‌హెల్త్-‌డిజిటల్‌ ‌పబ్లిక్‌ ‌గూడ్స్ ‌గ్లోబల్‌ ‌సౌత్‌ ‌లో ఆరోగ్యాన్ని విప్లవాత్మకంగా మార్చగల గ్లోబల్‌ ‌విజన్‌ను రూపొందించడానికి జి-20 మనకు అరుదైన అవకాశాన్ని అందించింది

ఈ రోజు కంప్యూటర్‌ ‌నెట్‌ ‌వర్క్ ‌లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోని ఇంటర్నెట్‌ ‌లేని ప్రపంచాన్ని ఊహించండి, అలాంటి సంబంధాలు తెగిపోయిన ప్రపంచంలో, ఒక దేశంలోని ప్రజలు ప్రపంచంలోని మరొక భాగంలో సంవత్సరాలుగా వాడుకలో ఉన్న చక్రాన్ని తిరిగి ఆవిష్కరించడం కొనసాగించవచ్చు. కానీ ప్రామాణికమైన ఇంటర్నెట్‌ ‌ప్రోటోకాల్‌ (ఐపి) లేకుండా, మన వాస్తవిక వెర్షన్‌  అనేక స్థానిక ప్రాంత నెట్వర్క్ ‌లతో ఒకటిగా పూర్తి భిన్నంగా కనిపించేది. కానీ ప్లగ్‌ ‌చేయడానికి ఉమ్మడి ఇంటర్నెట్‌ ‌లేదు. వాస్తవికత  ఈ ప్రత్యామ్నాయ వెర్షన్‌ ‌నేడు డిజిటల్‌ ‌హెల్త్ ‌స్పేస్‌ ఎదుర్కొంటున్న ఫ్లక్స్ ‌మాదిరిగానే అంతరాయం కలిగించే సాంకేతికతల అంచున ఉంది, కానీ దిశ, ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్ ఇం‌కా అంతర్జాతీయ నాయకత్వం నుండి నిర్ణయాత్మక ప్రేరణ కోసం వేచి ఉంది, తద్వారా నివసిస్తున్న బిలియన్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా గ్లోబల్‌ ‌సౌత్‌లో ఆవిష్కరణలను పెంచవచ్చు. వాటినినిలబెట్టుకోవచ్చు. డిజిటల్‌ ఆరోగ్యం యొక్క ఉత్తేజకరమైన ప్రపంచం సబ్‌ ‌సెక్టార్లు•-స్మార్ట్ ‌వేరబుల్స్, ఇం‌టర్నెట్‌ ఆఫ్‌ ‌థింగ్స్•- ‌వర్చువల్‌ ‌కేర్‌, ‌రిమోట్‌ ‌మానిటరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్, ‌బిగ్‌ ‌డేటా అనలిటిక్స్, ‌బ్లాక్‌-‌చైన్‌, ‌డేటా మార్పిడి, నిల్వ, రిమోట్‌ ‌డేటా క్యాప్చర్‌ ‌ను ప్రారంభించే సాధనాలు వంటి చిన్న – అయినా శక్తివంతమైన పైలట్లు, ఆవిష్కరణలతో నిండి ఉంది- కానీ ఏకీకృత ప్రపంచ దృష్టి లేకుండా విచ్ఛిన్నమైన పర్యావరణ వ్యవస్థలో చిక్కుకుపోయింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో డిజిటల్‌ ‌సాధనాల అపారమైన సామర్థ్యాన్ని మహమ్మారి కారణంగా మనం ఇప్పటికే గుర్తించిన సమయంలో ఇది జరిగింది.

డిజిటల్‌ ‌హెల్త్ ‌పుష్‌ ‌రూపకల్పన-భారతదేశంలో గొప్ప ప్రయోగం
ఇటీవలి కాలంలో ప్రజారోగ్య రంగంలో డిజిటల్‌ ‌సాధనాల మార్పు సామర్థ్యాన్ని భారతదేశంలో మనం చవి చూస్తున్నాం. అనుభవించాము. కోవిడ్‌ -19 ‌సమయంలో, కోవిన్‌ , ఇ-‌సంజీవని వంటి ప్లాట్ఫామ్‌ ‌లు, వ్యాక్సిన్లు , ఆరోగ్య సేవలను చేరుకోవడం కష్టమైన వారితో సహా ఒక బిలియన్‌ ‌మందికి పైగా ప్రజలకు అందించే విధానాన్ని మార్చే సంపూర్ణ గేమ్‌ ‌ఛేంజర్లుగా నిరూపించబడ్డాయి. భారతదేశ కోవిడ్‌ -19 ‌వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమానికి డిజిటల్‌ ‌వెన్నెముక అయిన కోవిన్‌ ఒక వైపు వ్యాక్సిన్‌ ‌లాజిస్టిక్స్ ‌ను ట్రాక్‌ ‌చేస్తూ, మరోవైపు కోవిడ్‌ -19 ‌వ్యాక్సినేషన్‌ ‌కోసం ప్రతి లబ్ధిదారుడిని నమోదు చేసింది, వాస్తవ వ్యాక్సినేషన్‌ ‌పక్రియ, వ్యాక్సినేషన్లకు రుజువుగా పనిచేసే డిజిటల్‌ ‌సర్టిఫికేట్లను సృష్టించింది. ప్రజలు – వ్యవస్థ మధ్య సమాచార అసమానతను తగ్గించడం ద్వారా, కోవిన్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ ‌ను ప్రజాస్వామ్యీకరించింది, అర్హులైన లబ్ధిదారులందరికీ టీకాలు అందుబాటులో ఉండేలా చూసుకుంది. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా అందరికీ వ్యాక్సినేషన్‌ ‌కు ఒకే మార్గం ఉండడంతో వ్యాక్సిన్ల కోసం అందరూ ఒకే క్యూలో నిలబడ్డారు. ఈ సాధనం సామర్ధ్యాన్ని గ్రహించిన మన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చారు.

అదేవిధంగా ప్రజలు తమ ఇంటి నుంచే వైద్యులతో ఆన్‌ ‌లైన్‌ ‌లో సంప్రదింపులు జరిపేందుకు వీలు కల్పించిన ఈ-సంజీవని టెలిమెడిసిన్‌ ‌ప్లాట్‌ ‌ఫామ్‌ ‌తక్షణ విజయాన్ని సాధించి, 10 కోట్లకు పైగా కన్సల్టేషన్లను నిర్వహించింది. మహమ్మారి పరాకాష్ట లో ఉన్నప్పుడు, ఇది రోజుకు 5 లక్షలకు పైగా సంప్రదింపులను నిర్వహించింది. డిజిటల్‌ ఎనేబుల్డ్ ‌కోవిడ్‌ ‌వార్‌ ‌రూమ్‌ ‌దాదాపు రియల్‌ ‌టైమ్‌ ‌లో సాక్ష్యం ఆధారిత విధాన నిర్ణయం తీసుకోవడానికి మనకు సహాయపడింది.ప్రత్యేక నిఘా వ్యవస్థ కోవిడ్‌ -19 ఇం‌డియా పోర్టల్‌ ‌భౌగోళికంగా వ్యాధిని ట్రాక్‌ ‌చేసింది. చేస్తుంది నిత్యావసర సరఫరాల కోసం జాబితాను పర్యవేక్షించింది, కేసుల లోడ్‌ ఆధారంగా జాతీయ, రాష్ట్ర ,జిల్లా స్థాయిలో డిమాండ్‌ ‌ను అంచనా వేసింది. ఆరోగ్యసేతు, ఆర్టీ-పీసీఆర్‌ ‌యాప్‌, ఇతర డిజిటల్‌ ‌టూల్స్ ‌మన కోవిడ్‌ -19 ‌పాలసీ ప్రతిస్పందనను పెద్ద ఎత్తున బలోపేతం చేసే విధానంగా డేటాను మార్చడానికి మన దేశాన్ని అనుమతించాయి. ప్రజారోగ్యంలో డిజిటల్‌ ‌సాధనాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, భారతదేశం ఇప్పటికే జాతీయ డిజిటల్‌ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ- ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌డిజిటల్‌ ‌మిషన్‌ (ఎబిడిఎమ్‌)  ‌ను నిర్మిస్తోంది / సృష్టిస్తోంది . ఇది రోగులకు వారి వైద్య రికార్డులను భద్ర పరచడానికి, ప్రాప్యత చేయడానికి, తగిన చికిత్స , అనుసరణలను నిర్ధారించడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాతలతో పంచుకోవడానికి అధికారం ఇస్తుంది. ఆరోగ్య సౌకర్యాలు, సర్వీస్‌ ‌ప్రొవైడర్ల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి ఇది రోగులకు సహాయపడుతుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం ప్రపంచం కోసం, ముఖ్యంగా తక్కువ ,మధ్య ఆదాయ దేశాలలో ఇలాంటి డిజిటల్‌ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థలను నిర్మించడానికి మన మా అభ్యాసాలు, వనరులను పంచుకోవడానికి సిద్ధంగా ఉంది, తద్వారా మన అనుభవాలు డిజిటల్‌ ‌పబ్లిక్‌ ‌వస్తువులపై వారి ప్రయత్నాలను తగ్గించగలవు. ప్రపంచంలోని ఈ ప్రాంతాల్లోని నిస్సహాయ ప్రజలు అత్యాధునిక డిజిటల్‌ ‌పరిష్కారాలు ,ఆవిష్కరణల ప్రయోజనాలను పొందవచ్చు , ఆరోగ్య విశ్వజనీకరణ కల కూడా సాకారం అవుతుంది.

గ్లోబల్‌ ‌డిజిటల్‌ ‌హెల్త్ ఎకోసిస్టమ్‌ అం‌టే ఏమిటి?
డిజిటల్‌ ‌పరిష్కారాలకు ప్రాప్యత కాపీరైట్‌ ‌నిబంధనలు, యాజమాన్య వ్యవస్థల ద్వారా నిరోధించబడుతుంది. చాలా పరివర్తనాత్మక డిజిటల్‌ ‌పరిష్కారాలు సులభంగా అందుబాటులో ఉండవు, ఎందుకంటే అవి వాటిని యాక్సెస్‌ ‌చేయడానికి అవసరమైన భాష, కంటెంట్‌ ‌మౌలిక సదుపాయాల పరంగా అసమానంగా పంపిణీ చేయబడతాయి. సంబంధిత డిజిటల్‌ ‌పబ్లిక్‌ ‌వస్తువులు లేదా ఓపెన్‌ ‌సోర్స్ ‌పరిష్కారాలు ఉన్నప్పటికీ, అవి ఒక వేదిక, డేటా, తర్కానికి కట్టుబడి ఉన్నందున వాటి ఉపయోగం పరిమితం, దీనికి సాధారణ ప్రపంచ ప్రమాణాలు లేవు. డేటా భద్రత, గోప్యత చుట్టూ ఉన్న సమస్యలను ఆందోళనలను పరిష్కరించేటప్పుడు వివిధ వ్యవస్థలలో పరస్పర పనితీరును చూసుకునే డిజిటల్‌ ఆరోగ్యం కోసం విస్తృతమైన గ్లోబల్‌ ‌గవర్నెన్స్ ‌ఫ్రేమ్‌ ‌వర్క్ ‌లేదు. డిజిటల్‌ ఆరోగ్యం చుట్టూ ప్రపంచ ప్రమాణాలను సృష్టించడానికి అనేక స్వతంత్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఈ కార్యక్రమాలు నిదానంగా పనిచేస్తున్నాయి. ఇంకా అమలు విషయం లో ఎటువంటి మద్దతు లేకుండా చాలావరకు సమన్వయం లేకుండా ఉన్నాయి. ఒక ప్రపంచ సమాజంగా మనం అన్ని ప్రయత్నాలను ఒకే ప్రభావవంతమైన గొడుగు కిందకు తీసుకురావడానికి సంకల్పించగలిగితే ఈ సవాళ్లు అవకాశాలుగా మారతాయి, డిజిటల్‌ ఆరోగ్యం కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న దార్శనికతను చర్చించడానికి , పెంపొందించడానికి జి -20 ఒక శక్తివంతమైన వేదికగా సమర్థవంతంగా సిద్ధంగా ఉంది.

డిజిటల్‌ ‌హెల్త్ ‌పురోగతి కోసం జీ-20 ఇండియా ప్రెసిడెన్సీ కృషి
మానవాళికి డిజిటల్‌ ఆరోగ్యం కోసం సమర్థవంతమైన గ్లోబల్‌ ‌బ్లూప్రింట్‌ ‌ను నిర్మించి అమలు చేస్తే అన్‌ ‌లాక్‌ ‌చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని ఊహించండి. అందుకోసం డిజిటల్‌ ఆరోగ్యంపై ఒక ప్రపంచవ్యాప్త చొరవగా చెదురుమదురుగా కొనసాగుతున్న ప్రయత్నాలను ఏకీకృతం చేయడానికి, పాలనా ఫ్రేమ్‌ ‌వర్క్ ‌ను సంస్థాగతం చేయడానికి, దశాబ్దాల క్రితం ఇంటర్నెట్‌ ‌కోసం చేసినట్లుగా ఒక ఉమ్మడి ప్రోటోకాల్‌ ‌పై సహకరించడానికి మనం సమిష్టిగా అంగీకరించాలిబీ ఆరోగ్య సంరక్షణలో డిజిటల్‌ ‌పరిష్కారాలను డిజిటల్‌ ‌పబ్లిక్‌ ‌వస్తువులుగా గుర్తించాలి, పెంచాలి. వివిధ విభాగాలు ,రంగాలకు చెందిన సంబంధిత భాగస్వాములందరినీ బోర్డులోకి తీసుకురావడానికి నిర్మాణాలను ఏర్పాటు చేయాలిబీ గ్లోబల్‌ ‌హెల్త్ ‌డేటా ఎక్స్ఛేంజ్‌ ‌కోసం నమ్మకాన్ని పెంపొందించాలి- అటువంటి కార్యక్రమాలకు నిధులు సమకూర్చే మార్గాలను అన్వేషించాలి.
జి-20 ప్రెసిడెన్సీ లో భాగంగా, భారతదేశంలో మనం ఈ సమస్యలలో కొన్నింటిపై ఏకాభిప్రాయం , రోడ్‌ ‌మ్యాప్‌ ‌నిర్మించడానికి ప్రయత్నిస్తాము, వాటిని అమలు చేయడానికి సాధ్యమయ్యే యంత్రాంగాలతో పాటు, తద్వారా గ్లోబల్‌ ‌సౌత్‌ ‌లోని దేశాలతో సహా మొత్తం ప్రపంచానికి డిజిటల్‌ ఆరోగ్యం పూర్తి సామర్థ్యాన్ని ఆవిష్కరించవచ్చు. డిజిటల్‌ ఆరోగ్యంలో పురోగతి సాధించడానికి మనకు కావలసిందల్లా మన సంకుచిత ప్రయోజనాలపై సమిష్టి మంచిని ఉంచడం ఇంకా యూనివర్సల్‌ ‌హెల్త్ ‌కేర్‌ ‌కవరేజీలో ‘విశ్వం’ మన స్వంత దేశాలకు మించి విస్తరించి ఉందని గ్రహించడం. సారాంశంలో, జి-20 లో మన ఉద్దేశ్యాన్ని మరియు కార్యాచరణను నడిపించేది ‘వసుధైక కుటుంబం ‘ అంటే ప్రపంచం ఒక కుటుంబం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబ అంటే ప్రపంచ ఆరోగ్యాన్ని కాపాడటం మన బాధ్యత.
డాక్టర్‌ ‌మన్సుఖ్‌ ‌మాండవీయ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎరువులు- రసాయనాల శాఖల మంత్రి, భారత ప్రభుత్వం

Leave a Reply